అమ్మో..తాప్సి ఏంటి ఈ ఫోజులు, మెసేజ్ లు?

అస్సలు గ్లామర్ పాత్రలు ఒప్పుకోను.... ఇక మీదట అందాల ఆరబోతకు ఓకే చెప్పకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఒప్పుకుంటానని... చెప్పుకొచ్చిన భామ తాప్సి ఇప్పుడు అందాల ఆరబోతలో ఆకాశమే హద్దంటూ సముద్రపు ఒడ్డున చెలరేగిపోతుంది. మొన్నామధ్యన అసలు ఒకప్పుడు ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలో సరైన గైడెన్స్ లేక కొన్ని గ్లామర్ పాత్రలు చేసేశాను... కానీ ఇప్పుడు మాత్రం అలా చెయ్యను అంటూ చెప్పుకొచ్చింది. మరి అంతలా చెప్పిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో 'జుద్వా-2' కోసం మాత్రం గ్లామర్ షోకి హద్దే లేదంటుంది.
ఇప్పుడు తాప్సి బికినీ వేసుకుని బీచ్ లో కనబడుతుంటే చూడడానికి రెండు కళ్ళు కూడా చాలవేమో అన్నట్టు ఉంది... తాప్సి బికినీ ఫొటోస్ చూస్తుంటే. ఇక ఆ ఫోటోలను పోస్ట్ చేసిన తాప్సి 'కెరటానికి ఎదురెళ్ళాలనుకుంటే, ధృఢంగా నిలబడాలి.. ఆ క్షణాల్లో పెదాలపై చిరునవ్వు మాత్రం మర్చిపోవద్దు..' అంటూ మెస్సేజ్ ఒకటి. మరి నిన్నటిదాకా చెయ్యను అంటూనే ఇప్పుడేమో ఇలా రెచ్చిపోవడం చూస్తుంటే మాత్రం తాప్సి చాలా ముదురు అనిపించడం లేదు. ఇక 'జుద్వా-2' కోసం తాప్సి తోపాటు జాక్వలిన్ కూడా ఇలాంటి బికినీ షోతోనే రెచ్చిపోతుంది.
మరి ఇప్పటివరకు బాలీవుడ్ లో పాతుకుపోవాలనే హీరోయిన్స్ ఇలానే గ్లామర్ షో చేశారు గాని.... మరీ తాప్సి లా ఎవరూ రెచ్చి పోలేదంటున్నారు. మరి 'జుద్వా-2' కోసం తాప్సి చేసిన ఈ షో ఫుల్ గా చూడాలి అంటే గనక సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే మరి.
Taapsee Pannu Sensational with Tweets
Taapsee Posted Photo and Message Sensation







































