ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kapil Sharma Show to go off small screen

ఈ కామెడీ షో ఆపేస్తున్నారు..!

హిందీలో కామెడీ షో అంటే బుల్లితెర వీక్షకులకు వెంటనే గుర్తొచ్చే పేరు 'కపిల్‌శర్మ షో'. ఈ షో కొన్నాళ్లు ఆగిపోతుండటం నిజంగా హిందీ కామెడీ ప్రియులకు కాస్త బాధాకరమే. ఈ షోలో కపిల్‌శర్మతో కలిసి నటిస్తూ కార్యక్రమాన్ని రక్తికట్టిస్తున్న ఇతర పార్టిసిపెంట్స్‌పై ఈ మధ్య కపిల్‌శర్మ విమానంలో ఓ నటుడిని కోపం వచ్చి కొట్టడం, ఈ సంఘటన అనంతరం పలువురు ఆ షోలో పాల్గొన్నవారు కూడా కపిల్‌ శర్మ తమతో కూడా ఇలాగే వ్యవహరించాడని ఆరోపించడంతో ఇది కొద్దికాలం కిందట వివాదాస్పదమైంది. 

కాగా ఈ మధ్య స్టార్‌ కమెడియన్‌ కపిల్‌శర్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఈ షో షూటింగ్‌ కూడా జరగడం లేదట. అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురవ్వడంతో ఈ షో షూటింగ్‌ని క్యాన్సిల్‌ చేశారు. ఇటీవలే ఆయన 'బాద్‌షాహో' ప్రోమో షూటింగ్‌ కూడా రద్దు కావడం గమనార్హం. దీంతో షో నిర్వాహకులు, కపిల్‌శర్మలు పరస్పర అంగీకారానికి వచ్చి బ్రేక్‌ తీసుకోవాలని నిర్ణయించారు. 

అయితే ఈ షో ఎంత కాలం వాయిదా పడిందో మాత్రం తెలియరావడం లేదు. కపిల్‌శర్మ మరలా పూర్తిగా ఆరోగ్యవంతుడైన తర్వాత ఈ షో షూటింగ్‌ జరుగుతుందని సమాచారం. అప్పటివరకు హాస్యప్రియులు ఎదురు చూడక తప్పదు. ఇక ఈ విషయాన్ని సదరు చానెల్‌ అఫీషియల్‌గా ప్రకటించింది.

Kapil Sharma Show to go off small screen, owing to comedy stars ill health

Kapil Sharma Show to go off small screen
kapil sharma show
comedy show
bollywood comedy show
kapil sharma
kapil sharma comedy show