జోరు పెంచుతున్న బాలయ్య అండ్ టీం..!

మొదట్లో సెప్టెంబర్ 29 లేదా 30 వ తేదీన దసరా కానుకగా రావడానికి పూరీ-బాలయ్యల 'పైసా వసూల్' వస్తుందని షూటింగ్ రోజే ప్రకటించారు. కానీ పూరీ అంటే సామాన్యుడు కాదు.. వేగంగా షూటింగ్‌తో పాటు ఒకే సమయంలో షూటింగ్‌లోనే స్పాట్ ఎడిటింగ్ చేయించడం, రెండు మూడు యూనిట్లతో జోరు పెంచడం పూరీ జగన్నాథ్‌కి కొత్తేమీ కాదు. ఇక సినిమా అంటే దాని కోసం రోజులోని 24 గంటలు బండ చాకిరి చేసి, అలసట లేకుండా చేయడంలో బాలయ్యది కూడా అదే స్టైల్.
ఇక 'పైసా వసూల్'తో పాటు ఎన్టీఆర్ 'జై లవ కుశ', మహేష్ బాబు 'స్పైడర్'లు కూడా దసరా కానుకగానే వస్తాయని, దీంతో ఈ దసరాకి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ తప్పదని భావించారు. కానీ 'పైసా వసూల్' స్టెంపర్ రిలీజ్ కావడం, ఈ జంగిల్ బుక్ పులికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో కేవలం దసరా సెలవులలోనే కాదు.. ఎప్పుడోచ్చినా ఈ చిత్రం దుమ్మురేపడం ఖాయమని అంటున్నారు. దాంతో పూరీ మరింత వేగంగా పనిచేస్తున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏకంగా సెప్టెంబర్ 1న లేదా సెప్టెంబర్ 7లలో ఏదో తేదీన ఇట్స్ ఏ యాక్షన్ ఫిల్మ్ అంటూ మందుతాగిన మదగజంగా బాలయ్య వచ్చేందుకు సిద్దమవుతున్నారు.
ఇక సెప్టెంబర్ 1న బివిఎస్ రవి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న 'జవాన్'ని విడుదల చేయాలని భావిస్తూ ఉన్నారు. ఇక ఇద్దరు మాస్ హీరోలైనా సరే బాలయ్యతో పోటీకి మెగా మేనల్లుడు సిద్దం కాకపోవచ్చని, 'పైసా వసూల్' రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ అయితే ముందుగా రావాలా? లేక ఆ తేదీ కంటే ఓ రెండు వారాలు వెనకగా రావాలా? అనేది తేజు డిసైడ్ చేసుకునే వీలుంటుంది.
Balakrishna Acted movie Paisa Vasool Movie director by Puri Jagannadh this movie Release plan on september 1st or 7th.
Paisa Vasool Movie Update







































