డ్రగ్ స్కాండిల్ : ఈ తారలకే నోటీసులు ఇచ్చింది!

Fri 14th Jul 2017 05:02 PM
drug scandal,raviteja,subbaraju,tarun,navdeep,charmi,puri jagannadh,drug scandal list of tollywood celebrities  డ్రగ్ స్కాండిల్ : ఈ తారలకే నోటీసులు ఇచ్చింది!
Drug Scandal - SIT Sends Notices to These Celebrities డ్రగ్ స్కాండిల్ : ఈ తారలకే నోటీసులు ఇచ్చింది!
Sponsored links

హైదరాబాద్ ని డ్రగ్ మాఫియా ఊపేస్తోంది. గత 10 రోజులుగా స్కూల్స్ లో, కాలేజెస్ లో, సినిమా ఇండస్ట్రీలో ఈ డ్రగ్ మాఫియా పాతుకుపోయినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్ డీలర్ కెల్విన్ ని పోలీస్ లు అరెస్ట్ చెయ్యడంతో... డ్రగ్ మాఫియా డొంక కదిలింది. అలాగే అతని నుండి కీలక సమాచారం రాబట్టింది. కెల్విన్ చెప్పిన వారిలో చాలామంది సినీ పెద్దలు కూడా ఉన్నారు. ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చినట్టు కూడా చెబుతున్నారు. అయితే టాలీవుడ్ లోని 15  మంది ప్రముఖులకు సిట్ నోటీసులు జారీచేసినట్టు చెప్పినప్పటినుండి సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు హడలిపోతున్నారు. ఆ 15  మందిలో టాప్ హీరో, హీరోయిన్స్, నిర్మాతలు, కేరెక్టర్ ఆర్టిస్టులు ఉన్నట్టు చెబుతున్నారు. అయితే వారెవరో అని అందరూ తెగ ఊహాగానాలతో ఊగిపోతున్నారు.

అయితే ఇపుడు డీలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం ప్రకారం.... మరియు డీలర్ కెల్విన్ ఫోన్ లోని నంబర్స్ ను బట్టి  టాలీవుడ్ లో నోటీసులు అందుకున్న వారిలో వీరున్నారు అంటూ ఒక లిస్ట్ బయటికి వచ్చింది. అందులో పేర్లను చూస్తుంటే ఇంతలా సినిమా ఇండస్ట్రీలో వారెలా ఉన్నారో అనిపిస్తుంది. అసలు సినిమాలు చేసి జనాలకు మెస్సేజ్ లు ఇచ్చే వీరు ఈ డ్రగ్స్ తో సమాజానికి ఎలాంటి మెస్సేజ్ ఇవ్వాలనుకున్నారని అంటున్నారు. ఇక అధికారులు నోటీసులు పంపిన ఆ 12 మెంబెర్స్. రవితేజ, యువహీరోలు నవదీప్, తరుణ్, తనీష్, నందు, హీరోయిన్లు చార్మి, ముమైత్‌ఖాన్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కెమెరామన్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, సుబ్బరాజులకు నోటీసులు జారీ చేసినట్టు చెబుతున్నారు.

నోటీసులు అందుకున్న వారంతా వారంలోగా తమ ముందు  హాజరై వివరణ ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశించినట్టు సమాచారం. కొంతమంది తమ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. వీళ్లంతా కెల్విన్‌తో టచ్‌లోవుండి, డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పూర్తి వివరాలను రాబట్టేందుకే నోటీసులు జారీ చేసినట్టు చెబుతున్నారు. వాళ్ల వివరణల తర్వాత కేసు పురోగతి ఎలా ఉండనుంది అనేది తెలియాల్సివుంది. ఇక ఈ డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్నవాళ్లకు సినిమా అవకాశాలు ఇక ఉండవని ఒక టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ మాట్లాడినట్లు వార్తలొస్తున్నాయి.

Sponsored links

Drug Scandal - SIT Sends Notices to These Celebrities:

Excise officials confirmed sending notices to these people and the media house got a copy of the report too. Raviteja, Puri Jagan, Tarun, Navdeep, Srinivasa Rao, Tanish and actor Nandu...got notices from the Excise Enforcement officials as per the reports

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019