Advertisement

మదర్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా...?

Sun 16th Apr 2017 12:56 PM
mothers characters,ramya krishna,henamalini,raasi,jayasudha  మదర్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా...?
మదర్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా...?
Advertisement

సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ఉంటున్నాయి. వారికి ఇచ్చే రెమ్యునరేషన్ తో ఒక చిన్న సినిమా తీసెయ్యొచ్చు. ఇక ఇప్పుడు వారితో పాటే హీరో హీరోయిన్స్ కి తల్లులు కేరెక్టర్స్ వేసే వారికి కూడా నిర్మాతలు భారీగానే ముట్టజెబుతున్నారట. ఒకప్పటి హీరోయిన్స్ ఇప్పుడు మదర్ కేరెక్టర్స్ లో ఇరగదీస్తున్నారు. యంగ్ లుక్ తో హీరోకి హీరోయిన్ కి సమానమైన పాత్రల్లో వారు నటిస్తూ మెప్పిస్తున్నారు. గ్లామర్ పరంగా హీరోయిన్స్ కి పోటీగా నిలబడుతున్నారు. అయితే వారెంత రిచ్ గా సినిమాల్లో కనిపిస్తున్నారో అంతే రిచ్ గా వారు నిర్మాతల నుండి వసూలు చేస్తున్నారు.

ఇప్పుడు మదర్స్ గా నటిస్తున్న వారిలో రమ్యకృష్ణ, నదియా, రేవతి, హేమమాలిని, జయసుధ, రాశి వంటివారు ఈ కేటగిరిలోకే వస్తుంది. వీరు హీరోయిన్స్ కి ధీటుగా సంపాదిస్తున్నారు. రమ్యకృష్ణ 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ కి తల్లిగా నటించి అదరహో అనిపించింది. ఇంత నటనకుగాను రమ్యకృష్ణ  బాహుబలి నిర్మాతల నుండి రోజుకు రెండు లక్షల ఛార్జ్ చేసిందని టాక్. అలాగే బాలకృష్ణ కి గౌతమీపుత్ర శాతకర్ణి లో బాలీవుడ్ నటి హేమమాలిని తల్లిగా బాగా మెప్పించింది. హేమమాలిని బాలకృష్ణ కి తల్లిగా నటించినందుకుగాను రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందట. ఇక అందమైన అత్త, తల్లి పాత్రల్లో నటించే నదియా కూడా బాగానే తీసుకుంటుందంట. రోజుకు రెండు లక్షలు ఛార్జ్ చేసే నదియా ఇతర ఖర్చులను కూడా నిర్మాతలమీదే రుద్దుతుందట.

ఇక సహజనటి జయసుధ కూడా సినిమాని బట్టి రెమ్యునరేషన్ వసూలు చేస్తుందట. ఒక్కో సినిమాకి 20 నుండి 25 లక్షలు ఛార్జ్ చేస్తుందట. ఇక హీరోయిన్ గా వర్కౌట్ అవ్వక పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిన రాశి మళ్లీ హీరోయిన్స్ కి తల్లి కేరెక్టర్స్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతానికి రాశి రెమ్యునరేషన్ రోజుకి 75 వేలవరకు తీసుకుంటుందట. ఇక రేవతి, పవిత్ర లోకేష్, మధుబాల, శరణ్య వంటివారు కూడా వారి వారి డిమాండ్ ని బట్టి నిర్మాతల దగ్గరనుండి తీసుకుంటున్నారట. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement