Advertisementt

'సచిన్‌' లోని స్పెషల్ ఇదే..!

Sun 16th Apr 2017 12:28 PM
sachin tendulkar,tendulkar biophic movie,ms dhoni biophic,azharuddin biophic  'సచిన్‌' లోని స్పెషల్ ఇదే..!
'సచిన్‌' లోని స్పెషల్ ఇదే..!
Advertisement
Ads by CJ

కొన్ని బయోపిక్‌లను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించాలి. ఏదైనా తేడా వస్తే అంతే సంగతులు... ఆయా వ్యక్తులకే కాకుండా సినిమా తీసిన వారికి కూడా చెడ్డపేరు వస్తుంది. కాగా ప్రస్తుతం క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ జీవితం ఆధారంగా బయోపిక్‌ వస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ చూస్తుంటే ఓ డాక్యుమెంటరీని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి కారణం చాలా ఈజీనే. ఈ చిత్రంలో తన పాత్రను తానే అంటే సచినే పోషిస్తుండటమే దీనికి కారణం. 

ఇక ఇందులో ఆయన అభిమానులకు, క్రికెట్‌ ప్రేమికులకు తెలియని సచిన్‌ జీవితంలోని పలు సంఘటనలను చూపించనున్నారని తెలియడం ఈ చిత్రంపై మంచి అంచాలేర్పడ్డాయి. కాగా పోయిన ఏడాది అజారుద్దీన్‌ బయోపిక్‌ వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఎంఎస్‌ ధోని బయోపిక్‌ వచ్చి సంచలన విజయం సాధించింది. ఇక అజర్‌, ధోనిల పాత్రలను బాలీవుడ్‌లో పేరున్న హీరోలు చేశారు. మరి సచిన్‌ లోని నటుడిని, అతని జీవితాన్ని జనం మెచ్చితే... కేవలం ఇండియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఈ చిత్రానికి తిరుగుండదని చెప్పవచ్చు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ