బ్యాడ్‌ సెంటిమెంట్‌ను అదిగమించేనా..?

ఇతర భాషల్లో సీక్వెల్‌ చిత్రాలు బాగా ఆడుతున్నాయి. కానీ టాలీవుడ్‌లో మాత్రం టైటిల్‌ రిపీట్‌ అయినా కూడా చిత్రాలు బొక్కబోర్లాపడుతున్నాయి. చిరంజీవికి 'శంకర్‌దాదా జిందాబాద్‌, పవన్‌కు 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌, బన్నీకి ఆర్య-2, రవితేజ 'కిక్‌2' ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక తాజాగా ఎన్టీఆర్‌ 'అదుర్స్‌2'; అల్లరినరేష్‌ 'సుడిగాడు2', వెంకీ 'గురు2'... ఇలా ప్లాన్‌ చేస్తున్నారు. మరోపక్క వెంకీ మొదటి పార్ట్‌లో కనిపించకపోయినా కూడా 'నాగవల్లి' పరిస్థితి అదే.

ఇక నాగ్‌ కూడా మొదటిపార్ట్‌లో తాను నటించకపోయినా కూడా 'రాజుగారి గది2' చేస్తున్నాడు. ఇక రాజమౌళి-ప్రభాస్‌ల 'బాహుబలి2' ఏప్రిల్‌ 28న విడుదలకు సిద్దమవుతోంది. మరి ఈ చిత్రాలైనా టాలీవుడ్‌లో సీక్వెల్స్‌కు ఊపుతెస్తాయా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది. 

chiranjeevi
shankardada mbbs
kick2
nagarjuna
venkatesh
prabhas
baahubali2