ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఎన్టీఆర్.. మార్పు మంచికే...!

'టెంపర్' ముందు ఎన్టీఆర్ వేరు.. ఇప్పుడు ఎన్టీఆర్ వేరు. ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 'టెంపర్'చిత్రం ద్వారా ఆయన మైండ్‌సెట్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత ఆయన చేసిన 'నాన్నకుప్రేమతో' చిత్రం దానిని నిరూపించింది. ఈ చిత్రంతో ఆయన క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించాడు. అండర్‌ప్లే నటనతో అలరించాడు. ఇక 'జనతా గ్యారేజ్' చిత్రం కాస్త రోటీన్ కథే అయిన తన నటనతో ప్రాణం పోశాడు. ప్రకృతి ప్రేమికునిగా జీవించాడు. త్రిపాత్రాభినయం చేయడమే కష్టమైతే... అందునా అందులో ఓనెగటివ్ పాత్రను ఆయన చేస్తున్నాడు.
ఈ చిత్రం కూడా హిట్టయితే ఆయన నుంచి మరిన్ని విభిన్న చిత్రాలను ఆశించవచ్చు. కాబట్టి మార్పు మంచికే అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఎవరి జీవితంలో అయినా ఏదో ఒక దశలో మార్పు వస్తుంది. దానిని సరిగ్గా వాడుకునే వారే గొప్పవారవుతారు.
jr ntr
ntr mind set changed totally
jai lava suka movie
ntr triple action movie







































