Advertisementt

దేవసేన..వల్ల అంత నష్టమా..!?

Thu 30th Mar 2017 09:44 PM
devasena,anushka,baahubali makers,ss rajamouli,size zero  దేవసేన..వల్ల అంత నష్టమా..!?
దేవసేన..వల్ల అంత నష్టమా..!?
Advertisement
Ads by CJ

బాహుబలి చిత్రం మొదటి పార్ట్‌ షూటింగ్‌ సమయంలోనే సెకండ్‌పార్ట్‌కి చెందిన అనేక సన్నివేశాలను జక్కన్న తీశాడు. అంటే ఇది దాదాపు రెండేళ్ల కిందటి మాట. అప్పుడు అనుష్క సన్నగా, నాజూకుగా ఉండేది. కానీ సెకండ్‌పార్ట్‌లోని దేవసేన సీన్స్‌ వద్దకు వచ్చేసరికి ఆమె 'సైజ్ జీరో' పుణ్యమా? అని బొద్దుగా తయారైంది. దాంతో ఈ చిత్రం సెకండ్‌ పార్ట్‌కి సంబంధించిన సీన్స్‌లో ఆమె బొద్దుగా ఉండి,  మొదటి పార్ట్‌ సమయంలోనే తీసిన సీన్స్‌లో ఆమె నాజూకుగా ఉండేసరికి రాజమౌళికి తిక్కరేగింది. దీంతో సెట్స్‌పైనే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడని కూడా వార్తలు వచ్చాయి. 

దీంతో దర్శకుడు రాజమౌళితో పాటు నిర్మాతలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అనుష్క నాజూకుగా ఉన్నప్పుడు తీసిన సీన్స్‌ను మరలా రీషూట్‌ చేశారట. ఇక పనిలో పనిగా రెండింటికి షూటింగ్‌ జరిపి గ్రాఫిక్స్‌ విభాగానికి ఆమెను నాజూకుగా చూపించే బాధ్యతను అప్పగించారని సమాచారం. దీంతో మరలా సీన్స్‌ని రీషూట్‌ చేయడంతో పాటు గ్రాఫిక్స్‌లో అనుష్కను నాజూకుగా చూపించడానికి ఈ చిత్ర నిర్మాతలకు 25 నుంచి 30కోట్ల వరకు అదనపు ఖర్చయిందని సమాచారం. 

మొత్తానికి ఓ హీరోయిన్‌కి మహా అయితే కోటి నుంచి ఐదు కోట్ల వరకు (బాలీవుడ్‌లోనైనా) రెమ్యూనరేషన్‌ ఇస్తారు. కానీ 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' కోసం దర్శకనిర్మాతలు అంత పెద్ద మొత్తం వెచ్చించడం చూస్తే ఆ డబ్బుతో అనుష్కతో ఓ లేడీ ఓరియంటెండ్‌ సబ్జెక్ట్‌కి సరిపడా బడ్జెట్‌ అయిందని చెప్పకతప్పదు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ