Advertisementt

పవన్‌ సంపాదన ఎంతో తెలుసా..?

Thu 30th Mar 2017 09:38 PM
pawan kalyan,remuneration,pawan kalyan and trivikram movie,power star  పవన్‌ సంపాదన ఎంతో తెలుసా..?
పవన్‌ సంపాదన ఎంతో తెలుసా..?
Advertisement
Ads by CJ

సాధారణంగా సినిమా ఫీల్డ్‌లో రెమ్యూనరేషన్‌ అనేవి ఎప్పటికి బయటకురావు. చూచాయగా, పుకార్ల రూపంలో మాత్రమే తెలుస్తుంటాయి. ఇక రజనీ ఇంత తీసుకుంటాడని, విజయ్‌, అజిత్‌లు అంత తీసుకుంటారని, చిరుకి ఇంత ఇస్తారని, మహేష్‌కి అంత ఇస్తారని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం పవన్‌ 'కాటమరాయుడు' చిత్రం ద్వారా 51కోట్లు సాధించాడని వార్తలు వస్తున్నాయి. 

ఇక త్వరలో ఆయన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో హారిక అండ్‌ హాసిని బేనర్‌లో రాధాకృష్ణ నిర్మాతగా ఓ చిత్రం మొదలుపెడుతున్నారు. ఈ బేనర్‌లో రాధాకృష్ణతో పాటు త్రివిక్రమ్‌ కూడా పార్ట్‌నరే. కానీ పవన్‌కి మాత్రం ఈ చిత్రం లాభాలలో వాటా కాకుండా రెమ్యూనరేషన్‌ని ఫిక్స్‌ చేశారట. దీనికి ముందే పవన్‌ మరో చిత్రం చేయాల్సి ఉన్నప్పటికీ ముందుగా హారిక అండ్‌ హాసినికి కాల్షీట్స్‌ ఇవ్వడం వెనుక త్రివిక్రమ్‌ హస్తంతో పాటు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్‌ కూడా ఓ కారణంగా చెబుతున్నారు. 

ఈ చిత్రం కోసం పవన్‌ 50రోజుల బల్క్‌ కాల్షీట్స్‌ ఇచ్చాడని, దీనికి ప్రతిఫలంగా ఆయన 50కోట్ల వరకు పుచ్చుకుంటున్నాడని సమాచారం. అదే నిజమైతే పవన్‌ రేటు రోజుకు కోటి రూపాయలన్న మాట...! మొత్తానికి హిట్‌ ఫ్లాప్‌లకు సంబంధం లేకుండా పవన్‌ కెరీర్‌ కొనసాగుతోందని చెప్పాలి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ