Advertisementt

రాజశేఖర్ కూతురికి లైన్ క్లియరైంది..!

Fri 10th Mar 2017 11:05 AM
jeevitha rajasekhar daughter,sivani,teja director  రాజశేఖర్ కూతురికి లైన్ క్లియరైంది..!
రాజశేఖర్ కూతురికి లైన్ క్లియరైంది..!
Advertisement
Ads by CJ

జీవిత రాజశేఖర్ పెద్ద కూతురు శివానిని హీరోయిన్ ని చెయ్యడానికి జీవిత శతవిధాలా కృషి చేస్తుంది. ఆమెను ఒక మంచి డైరెక్టర్ చేతిలో పెట్టి గ్రాండ్ గా లాంచ్ చెయ్యాలని చూస్తుంది. ఒక్కసారి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఉండేలా అన్ని పకడ్బందీగా జీవిత ప్లాన్ చేస్తుంది. అయితే మొన్నామధ్యన శివాని ఒక కొత్త చిత్రానికి సైన్ చేసిందని.... తొందరలోనే ఆ చిత్రం మొదలవుతుందని వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తలను జీవిత ఖండించింది. అయితే ఇప్పుడు జీవిత మాత్రం శివానిని ఒక డైరెక్టర్ చేతికి అప్పగించబోతుందని సమాచారం. ఒకప్పుడు జీవిత క్లాస్ మెట్ అయినా డైరెక్టర్ తేజకి తన కూతురి మొదటి సినిమా దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చినట్లు ప్రచారం మొదలైంది.

ఇక తేజా ప్రస్తుతం రానా దగ్గుబాటి హీరోగా 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ చిత్రం కంప్లీట్ కాగానే జీవిత రాజశేఖర్ కూతురు శివానిని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతని తేజ నెత్తికెత్తుకున్నట్లు చెబుతున్నారు. అసలు తేజ.. శివాని తండ్రి రాజశేఖర్ హీరోగా 'అహం' చిత్రం చెయ్యాల్సి వుంది. ఎందుచేతనో ఆ చిత్రం సెట్స్ మీదకెళ్ళలేదు. మరి రాజశేఖర్ తో చేసే చిత్రాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కూతుర్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాడో అని వేచి చూస్తున్నారు సినీప్రియులు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ