Advertisementt

సోనమ్ ప్రేమికుడినే..పెళ్లాడబోతుంది..!

Fri 10th Mar 2017 11:03 AM
sonam kapoor,sonam kapoor with anand ahuja,sonam kapoor marriage,sunitha  సోనమ్ ప్రేమికుడినే..పెళ్లాడబోతుంది..!
సోనమ్ ప్రేమికుడినే..పెళ్లాడబోతుంది..!
Advertisement
Ads by CJ

ప్రముఖ బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ చాలా కాలం నుండి ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే సోనమ్ కపూర్ ఢిల్లీకి చెందిన యువ వ్యాపార వేత్త అయిన ఆనంద్ అహుజాతో ప్రేమలో మునిగితేలుతున్నట్లుగా అప్పట్లో బాలీవుడ్ మీడియా వెల్లడించిన విషయం కూడా విదితమే. అప్పుడు మీడియా సోనమ్ ను ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు అదేం లేదన్నట్లుగా పలుమార్లు తప్పించుకు తిరిగిన సందర్భాలు కూడా మనం చూశాం.  అలా వాళ్ళిద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా హల్ చేశాయి. కాగా అలా ఆనంద్ తో తిరుగుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాను ఆనంద్ తో ప్రేమలో ఉన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది సోనమ్.

అయితే తాజాగా సోనమ్ కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీ వ్యాపారవేత్త అయిన ఆనంద్ తో వివాహానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అందుకు సాక్ష్యంగా సోనమ్, ఆనంద్ ల వివాహానికి తాను ఓకే చెప్పినట్లు సోనమ్ తల్లి సునీత మీడియాకు కూడా వెల్లడించింది. అంతే కాకుండా ఈ ఏడాది చివరికంతా వీళ్ళిద్దరూ వివాహం చేసుకొంటే జంటగా చూడాలని ఉందని సునీత మీడియాకు తెలిపింది. మొత్తానికి సోనమ్ ప్రేమించిన వారినే పెళ్ళాడబోతుందన్న మాట.  కాగా ప్రస్తుతం సోనమ్ కపూర్, సంజయ్ దత్ బయోపిక్ లో, ఇంకా ప్యాడ్ మాన్ లో అక్షయ్ కి జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే.  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ