Advertisementt

నేడు యూపీలో వింత రాజకీయాలు..!

Wed 22nd Feb 2017 02:07 PM
tamilnadu,up politics,amarnath,mulayam,samajwadi party in up  నేడు యూపీలో వింత రాజకీయాలు..!
నేడు యూపీలో వింత రాజకీయాలు..!
Advertisement
Ads by CJ

ఉత్తరప్రదేశ్ లో రాజకీయం యమా రంజుమీదున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ రాజకీయాలను ఆశ్రయించి తండ్రీ కొడుకుల మధ్య పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే.   ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ అంతర్గత కుమ్ములాట కారణంగా ఏర్పడిన రాజకీయ సంక్షోభం గురించి తెలిసిందే. అక్కడ తండ్రీ కొడుకులు రెండు కూటములుగా ఏర్పడి పోట్లాడుకున్న వాళ్లు, ఆ తర్వాత వెంటనే ఎటువంటి కారణాలు లేకుండా.. తగూలాడుకోవటం.. వెంటనే మళ్లీ కలిసిపోవటం వంటి చిత్ర విచిత్రమైన సన్నివేశాలను చూడబోతే ఇదంతా ఓ సినిమా స్క్రిప్టును తలబోస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఉత్తరప్రదేశ్ లోని సమాజ్వాదీ పార్టీలో రాజుకున్న రాజకీయాల గురించి పలువురు పలు విధాలుగా భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడానికి తండ్రీ కొడుకులు ఇద్దరూ నాటకాలు ఆడుతున్నట్లుగా కూడా పలువురు విమర్శకులు వెల్లడిస్తున్నారు.   అధికారం కోసం ఇంత డ్రామా ఆడాలా? అంటూ కొందరు సీరియస్ అవుతుంటే... మరికొందరు ఇదో వింత ప్రహసనంగా అనుమానిస్తున్న వారు ఉన్నారు. ఆ అనుమానం ప్రబలమయ్యేలా... ఎన్నికల సమయంలో సమాజ్వాదీ పార్టీలో సంభవించిన అంతర్గత రాజకీయాలు, ఆ వెంటనే అవి సమసిపోయి సాధారణ స్థాయికి రావడం వంటి విషయాల పట్ల తాజాగా ములాయంకు సన్నిహితుడైన అమర్ సింగ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 

ఉత్తరప్రదేశ్ లోని సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం.. అంతా కూడా ములాయం సింగ్ ఆడిన నాటకంగా ఆయన తెలిపాడు. మళ్లీ కొడుకు అఖిలేశ్ ను సీఎంను చేయడానికే ములాయం ఈ డ్రామాను రక్తికట్టించినట్లుగా ఆయన వివరించాడు.

ఇంకా అమర్ సింగ్ మాట్లాడుతూ... ములాయం సింగ్ పెద్ద స్క్రిప్ట్ రైటర్ అంటూ జోకులు పేల్చిన ఆయన అసలు యూపీలో కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీల మధ్య పొత్తుకు కారణం ములాయం సింగ్ అని ఆయన వివరించాడు. 

అయితే ములాయం ఎప్పుడూ కూడా అమర్ సింగ్ తనకు గుండెలాంటోడు అని చెప్పుకుంటాడు. అలాంటి అమర్ సింగ్ ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో ములాయంను రాజకీయంగా దెబ్బతీసేలా ఎందుకు మాట్లాడారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.  ఇదే నిజమైతే తండ్రీ కొడుకులు ఆడే ఈ నాటకం ద్వారా జనాలను మరీ పిచ్చోళ్ళను చేయడం ఖాయంమన్నది రాజకీయ విశ్లేషలుకులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.  

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ