Advertisement

కోటీశ్వరుడికి 'చిరు' విన్నపం..!

Wed 22nd Feb 2017 01:38 PM
meelo evaru koteswarudu,mek,chiranjeevi,nag,sms,voice over  కోటీశ్వరుడికి 'చిరు' విన్నపం..!
కోటీశ్వరుడికి 'చిరు' విన్నపం..!
Advertisement

ఎన్నోఏళ్లు మెగాస్టార్‌గా నిలిచి టాలీవుడ్‌ దశని, దిశని మార్చి, నెంబర్‌వన్‌గా నిలిచిన చిరు ఆ తర్వాత రాజకీయాలలోకి వెళ్లి మరలా ప్రస్తుతం నటన వైపు ఆసక్తి చూపడం ఎందరో సినీ ప్రేమికులకు శుభవార్త. కాగా ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన చాలామందికి చిరు సాయం అందించారు అనేది వాస్తవం. ఆయన హీరోగా బిజీగా ఉన్నప్పుడు తన ఇష్టదైవమైన ఆంజేయస్వామి మీద వచ్చిన 'హనుమాన్‌' అనే యానిమేషన్‌ చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అది అంతటి ప్రయోగాన్ని చేసిన నిర్మాతలకు బాగానే ఉపకరించింది. ఇక ఆతర్వాత గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన 'రుద్రమదేవి' చిత్రానికి ఆయనిచ్చిన వాయిస్‌ ఓవర్‌ ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా 'ఘాజీ' వంటి సాహసోపేతమైన చిత్రానికి ఆయన గొంతు అరువిచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. కొత్త దర్శకుడైన సంకల్ప్‌ అనే యువకుడే తీసిన ఈ చిత్రానికి చిరు ప్రోత్సాహం చాలా ఉపకరించింది. ఇక తాజాగా ఆయన మంచు మనోజ్‌ నటిస్తున్న 'గుంటూరోడు' చిత్రానికి కూడా వాయిస్‌ఓవర్‌ ఇస్తున్నారు. ఎంతోకాలంగా చిరంజీవికి, మోహన్‌బాబుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని అందరూ భావిస్తున్నారు. ఇందులో నిజం కూడా ఉంది. కానీ వాటన్నింటిని పక్కనపెట్టి మంచు మనోజ్‌ హీరోగా సత్య అనే కొత్త దర్శకుడు తీస్తున్న 'గుంటూరోడు' చిత్రానికి కూడా ఆయన వాయిస్‌ కలిసొస్తే అది ఆయన కెరీర్‌కు, ఏదో వైవిధ్యం చూపించాలని ప్రయోగాలు చేస్తున్న మనోజ్‌కు కలిసి వస్తుందనే చెప్పాలి. ఈ చిత్రం మార్చి3న విడుదలకు సిద్దమవుతోంది. 

కాగా ప్రస్తుతం చిరు హోస్ట్‌గా చేస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' విషయంలో ఆ ఛానల్‌ నిర్వాహకులు చేస్తున్న విషయంపై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నాగ్‌, చిరుల వల్లనే ఈ కార్యక్రమానికి ఇంతగా రెస్పాన్స్‌, రేటింగ్స్‌ వస్తున్నాయనేది వాస్తవం. దాంతో వీటి వీక్షకుల సంఖ్య కూడా పెరుగుతూ, చిన్న మధ్యతరగతితో పాటు చదువు పెద్దగా రాని వారిని సైతం ఈ కార్యక్రమం ఆకట్టుకుంటోంది. కాగా ఈ కార్యక్రమం విషయంలో నాగ్‌ ఉన్నప్పటి నుంచే ఓ విమర్శ బలంగా వినిపిస్తోంది. నాగ్‌, చిరుల క్రేజ్‌ను అడ్డుపెట్టుకుని ఈ ఛానెల్‌ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని చూసే వీక్షకులకు కూడా ఓ ప్రశ్న వేసి సమాధానం సరిగా చెప్పిన వారిలో ఒకరిని లాటరీ ద్వారా ఎంపిక చేసి, వారికి 10వేలు ప్రైజ్‌ మనీ ఇస్తున్నారు. దీని ఉద్దేశ్యం ఈ షోను చూసే వారిని కూడా ఈ గేమ్‌లో భాగస్వాములను చేయడానికే. కానీ ఒక్కో ఎస్‌ఎంయస్‌కి దాదాపు 15రూపాయలు ఛానెల్‌ వారు వసూలు చేసుకొని, లక్షల సంఖ్యలో వచ్చే ఎస్సెమ్మెస్‌ల ద్వారా కోట్లు సంపాదిస్తూ, వీక్షకులలో ఒకరికి 10వేలు ఇవ్వడం న్యాయంకాదు. లాటరీలు, సింగిల్‌ నెంబర్‌ లాటరీలు ఎలాగో ఇదీ అలాంటి వ్యాపారమే. ఇది చట్టబద్దం అయినంత మాత్రాన న్యాయబద్దం కాదు. చిరు, నాగ్‌లు ఆ ఛానెల్‌ నిర్వాహకులుగా గతంలో చేశారు. వారికున్న చానల్‌ అధినేతలతో ఉన్న పరిచయాలతో ఈ మోసాన్ని అరికడితే బాగుంటుంది....!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement