ఇటీవల దర్శకుడు వినాయక్ కెరీర్ కాస్త గాడి తప్పింది. కానీ చిరంజీవి ఇచ్చిన బంపర్ ఆఫర్‌తో 'ఖైదీ...' చిత్రాన్ని తెరకెక్కించి, విజయం సాధించాడు. ఇక ఈ చిత్రంతో చిరు వరుస చిత్రాలు చేయనున్నాడు. మరోపక్క చిరు 151వ చిత్రాన్ని కూడా చరణే నిర్మించనున్నాడు. ఇక హీరోగా కూడా చరణ్ బిజీ. కాజల్ కూడా బిజీగా మారింది. ఇలా 'ఖైదీ'తో అందరూ బిజీగా మారితే వినయ్ మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు. ఇంకా తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఆయన తదుపరి చిత్రం మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో అని, కాదు ఎన్టీఆర్‌తో అని ప్రచారం జరుగుతోంది. కానీ ఎన్టీఆర్ బాబి, త్రివిక్రమ్‌లతో బిజీ. సాయి కూడా బి.వి.యస్.రవి దర్శకత్వంలో 'జవాన్'లో బిజీ. మిగిలిన హీరోలు కూడా బిజీగా ఉండటంతో వినయ్ ఎట్టకేలకు గట్టిగా ప్రయత్నించి మరో బంపర్ ఆఫర్‌ని కొట్టాడని సమాచారం.
తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర...' తర్వాత బాలయ్య తన 101వ చిత్రంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. 'రైతు'తో పాటు పలు ఆప్షన్స్ చూసుకుంటున్నాడు. 'గౌతమీ పుత్ర...' వంటి హిస్టారికల్ చిత్రం తర్వాత బాలయ్య ఓ మాస్ చిత్రం చేయాలని భావిస్తున్నాడట. కాగా గతంలో వినయ్ దర్శకత్వంలో బాలయ్య నటించిన 'చెన్నకేశవరెడ్డి' పెద్దగా ఆడలేదు. కానీ ఈ చిత్రంలో పెద్ద బాలయ్యను వినయ్ అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించిన మాట వాస్తవం. అప్పుడే బాలయ్య నీతో మరోసారి చేస్తా అని కూడా మాట ఇచ్చాడు. దానిలో భాగంగా ఇప్పుడు వినయ్ బాలయ్యకు ఓ పవర్‌ఫుల్ స్టోరీ చెప్పాడని, బాలయ్యకి కూడా విపరీతంగా నచ్చడంతో వెంటనే పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట.
ఇప్పుడు వినయ్ అదే పనిలో రాత్రింబగళ్లు కష్టపడుతున్నాడని సమాచారం. ఈ చిత్రమే కనుక పట్టాలెక్కితే మరో సంచలనానికి తెరతీసినట్లే అవుతుంది. ఈమధ్యకాలంలో 'గౌతమీపుత్ర..' తరహాలో కాకుండా బాలయ్యను పక్కామాస్‌గా బాగా చూపించిన ఘనత బోయపాటిశ్రీనుకి దక్కుతుంది. కానీ బోయపాటి కంటే ఇంకా బాగా వినయ్ తన చిత్రాలలోని హీరోలను అన్ని కోణాల్లో చూపిస్తాడనే పేరుంది. మరి ఓ పక్కా మాస్ ఇమేజ్ ఉన్న స్టార్‌కు మరో ఊరమాస్ డైరెక్టర్ తోడై... 'చెన్నకేశవరెడ్డి'లో జరిగిన పొరపాట్లు జరగకుండా ఉంటే మాత్రం వినయ్-బాలయ్యల చిత్రం సంచలనం సృష్టించడం ఖాయం. మరోపక్క ఈ చిత్రం బాలయ్య 101వ చిత్రంగా భవ్య ఆర్ట్స్ బేనర్‌లో రూపొందే అవకాశం ఉందని, లేదా 102వ చిత్రంగా బెల్లంకొండ సురేష్‌కి చేసే ఉద్దేశ్యంలో బాలయ్య ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.