చిన్నమ్మా నీ పని అయిపోయిందమ్మా...!

Wed 15th Feb 2017 11:47 AM
tamil nadu politics,pannerselvam,sasikala,deepak,tamil nadu cm issue,harassed sasikala  చిన్నమ్మా నీ పని అయిపోయిందమ్మా...!
చిన్నమ్మా నీ పని అయిపోయిందమ్మా...!
Advertisement
Ads by CJ

తమిళనాడు పాలిటిక్స్ లో రోజు రోజుకి ఉత్కంఠతో ఎవరు సీఎం అనేదానిపై ఇప్పటికి కొలిక్కి రాని ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం కుర్చీకి దూరమైన శశికళ తమ వర్గం నుండి ఎవరిని సీఎంబరిలో దింపుతోంది అనేది ప్రస్తుతానికి సస్పెన్సు, జయ మేనల్లుడు దీపక్ జయ చనిపోయిన రోజున జనాలకు కనబడిన వ్యక్తి  మళ్లీ ఇప్పుడు గోల్డెన్ బె రిసార్ట్స్ లో ప్రత్యక్షమవడంతో దీపక్ నే సీఎం కుర్చీ ఎక్కించడానికి శశికళ ప్రయత్నం చేస్తుందనే ప్రచారం మొదలైంది. ఏ క్షణానైనా శశికళ అరెస్ట్ అవుతుందనే వదంతులతో తమిళనాడులో పోలీస్ బలగాలు ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్న తరుణంలో శశికళ మాత్రం ఈ టైమ్ లో కూడా తన ఆలోచనలకూ పదును పెడుతుంది. తాను వెనకుండి తమిళ రాజకీయాలను శాశించడానికి ఎత్తులు వేస్తూ గోల్డెన్ బె రిసార్ట్స్ లో బిజీ బిజీ గా గడుపుతుంది. 

మరోవైపు పన్నీర్ సెల్వం తన దూకుడు ప్రదర్శిస్తున్నాడు. తనవైపు ఎమ్యెల్యేలు ఎంతమంది ఉన్నారో ఇప్పటివరకు ఆయనకే తెలియదనే కామెంట్స్ వినబడుతున్న తరుణంలో శశికళ జైలు కెలుతుందనే వార్త వినప్పటి నుండి పన్నీర్ శిబిరంలో పండగ వాతావరణం కనబడుతుంది. ఇక పన్నీర్ సెల్వం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మళ్లీ జయలలిత పాలన తమిళనాట జరుగుతుందని.... మనమే  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు గవర్నర్ ని కలిసి మళ్లీ బల నిరూపణకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం.

ఏది ఎలాగున్నా చినమ్మ ఆశకు మాత్రం గండి పడింది. 33  ఏళ్ళ నుండి జయలలిత పక్కనే ఉండి అవకాశం కోసం ఎదురు చూస్తూ కళ్ళలో వత్తులు వేసుకుని.... జయకు మంచి చేసిందో చెడె చేసిందో తెలియదు గాని ఇప్పుడు ఆమె చేసిన పనులకి మాత్రం నిజంగా శిక్ష అనుభవిస్తుంది అని అంటున్నారు. మరోవైపు తన కుటుంబ సభ్యులని తమిళనాడు రాజకీయాల్లో కీలకమైన వ్యక్తులుగా నియమించి  ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకుని తమిళనాడుని శాసించాలనుకున్న శశికి కోర్టు గట్టి దెబ్బ వేసింది. ఆమెకి ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ అది. మరి శశికళ నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది కేవలం తమిళనాడు ప్రజలే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ