Advertisementt

ట్రైలరేనా..సినిమా కూడా మీసం తిప్పుతుందా..?

Wed 21st Dec 2016 01:27 PM
gautamiputra satakarni,gautamiputra satakarni trailer,kabali,rajinikanth,balakrishna,krish director  ట్రైలరేనా..సినిమా కూడా మీసం తిప్పుతుందా..?
ట్రైలరేనా..సినిమా కూడా మీసం తిప్పుతుందా..?
Advertisement
Ads by CJ

'దేశం మీసం తిప్పుదాం' అంటూ 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం ట్రైలర్‌లో బాలయ్య బాబు చెప్పిన డైలాగ్‌ మన భారతీయులందరికీ తెగ నచ్చేసింది. అందుకే ట్రైలర్‌ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. వాస్తవానికి బాలయ్య బాబు గత చిత్రాలకు రాని, టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఇంకో చిత్రానికి లేని రికార్డులను 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర ట్రైలర్‌ అందుకోవడం విశేషం. నిజంగా ఆ డైలాగ్‌లో ఉన్న విషయంలానే ట్రైలర్‌ మీసం తిప్పేసింది. మరి సినిమా సంగతి ఏంటి? ఇప్పటి వరకు డైరెక్టర్‌ క్రిష్‌ చిత్రాల గురించి ఒక్కసారి తిరగేస్తే..కంటెంట్‌ మాత్రం కరెక్ట్‌గా ఉంటుంది..కానీ కమర్షియల్‌ హిట్‌ మాత్రం ఇంత వరకు క్రిష్‌కి దక్కలేదు. సో..దీనిని బట్టి డైరెక్టర్‌ క్రిష్‌ డైరెక్షన్‌లో ఏదో తెలియని లోపం ఉందని అనకుండా ఉండలేం. కాకపోతే బాలయ్య బాబు సినిమా కాబట్టి..అందులో 100వ సినిమా కాబట్టి ఈ లోపంని ఈసారి క్రిష్‌ జయించే అవకాశం ఉంది. 

ఆ సంగతి ప్రక్కన పెడితే..ప్రస్తుతం వస్తున్న చిత్రాలకు ట్రైలర్‌లో తప్పిదే సినిమాల్లో మ్యాటర్‌ అంతంత మాత్రమే ఉంటుంది. ట్రైలర్‌ అలరించినంతగా..సినిమాలు ప్రేక్షకులని అలరించలేకపోతున్నాయి. అందుకు ఉదాహరణ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 'కబాలి' చిత్రమే. 'కబాలి' ట్రైలర్‌ వరల్డ్‌ వైడ్‌గా ఎంతటి సంచలనం అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ సినిమా రిజల్ట్‌ ఏంటో అందరికీ తెలిసిందే. సో..ట్రైలర్‌ని బట్టి 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాని అంచనా వేద్దాం అంటే..అందుకు 'కబాలి' ఒప్పుకోవడం లేదు. సో..'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం మీసం తిప్పేదీ..లేనిదీ తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్‌ చేయకతప్పదు..మరి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ