పెద్ద పెద్ద అవకాశాలతో దూసుకుపోతుంది..!

Wed 21st Dec 2016 01:24 PM
Advertisement
anupama parameswaran,anupama parameswaran in ram charan film,sukumar,anupama parameswaran top heroine  పెద్ద పెద్ద అవకాశాలతో దూసుకుపోతుంది..!
పెద్ద పెద్ద అవకాశాలతో దూసుకుపోతుంది..!
Advertisement

'అఆ' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మలయాళీ భామ  అనుపమ పరమేశ్వరన్ నటనతో, అభినయంతో అందరిని ఆకట్టుకుంది. మొదటి సినిమాకే మంచి మార్కులు కొట్టేసిన అనుపమ తర్వాత నాగ చైతన్య 'ప్రేమమ్' లో నటించింది. ఇక 'ప్రేమమ్' హిట్ తో అనుపమ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆమెకి అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయని అంటున్నారు. ఇక 'ప్రేమమ్' సినిమా అయిపోగానే అనుపమ, శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న 'శతమానం భవతి' చిత్రం లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. 'శతమానం భవతి' చిత్రం సంక్రాంతికి విడుదలకి సిద్ధమైంది.

ఇక అనుపమ తెలుగులో మంచి అవకాశాలే చేజిక్కించుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది. అయితే అనుపమ పరమేశ్వరన్ 'అఆ' చిత్రంలో నటించేటప్పుడే త్రివిక్రమ్ ఆమెకి మరో సినిమాలో ఛాన్స్ ఇస్తానని కమిట్ అయినట్లు వార్తలొచ్చాయి. అదలా ఉండగా ఇప్పుడు అనుపమకు మరో గోల్డెన్ ఛాన్స్ వచ్చిందనే ప్రచారం మొదలైంది. ఆమె నటనకు ముగ్దుడైన సుకుమార్ తాను రామ్ చరణ్ తో చెయ్యబోయే సినిమాలో హీరోయిన్ గా అనుపమని తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్ అయితే పల్లెటూరి పిల్లగా బావుంటుందని సుకుమార్ భావించి ఆమెకి అవకాశం ఇచ్చాడని చెబుతున్నారు. ఇక మరోవైపు  ఎన్టీఆర్ - బాబీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో కూడా ఒక హీరోయిన్ గా అనుపమని తీసుకున్నారని అంటున్నారు. 

మరి ఈ రెండు న్యూస్ లు నిజమై ఆమెకి నిజంగా ఆ మూవీస్ లో గనక ఛాన్స్ వస్తే ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోతుందని అంచనా వేసేస్తున్నారు. ఇదే గనక నిజమైతే ఆమె ఒక్కసారే స్టార్ హీరోయిన్ గా మారి మిగతా టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇకపోతే అనుపమ ఇప్పటికే తెలుగు నేర్చేసుకుందట. రీసెంట్ గా జరిగిన 'శతమానం భవతి' చిత్ర ఆడియో వేడుకలో అనుపమ స్పష్టమైన తెలుగు మాట్లాడడంతో.. హీరోయిన్ గా తన పాత్రకి తానే.. డబ్బింగ్ చెప్పేసుకుంటే.. ఇక అనుపమకు టాలీవుడ్ లో తిరుగులేకుండా పోతుందనేది అక్షర సత్యం. 

Advertisement
Advertisement

Loading..
Loading..
Loading..
advertisement