ఆమె అత్యాశకు నిర్మాతలు భయపడిపోతున్నారు..!

Wed 14th Dec 2016 04:56 PM
kangana ranaut heroine,deepika padukone,priyanka chopra,bollywood heroines,kangana ranaut 15 crores enummaration  ఆమె అత్యాశకు నిర్మాతలు భయపడిపోతున్నారు..!
ఆమె అత్యాశకు నిర్మాతలు భయపడిపోతున్నారు..!
Sponsored links

దీపికాపడుకొనే, ప్రియాంకాచోప్రా తదితర హీరోయిన్లు హాలీవుడ్‌కు వెళ్లడం, మరోపక్క కత్రినాకైఫ్‌ లాంటి హీరోయిన్లకు ఏజ్‌ బార్‌ అవుతుండటంతో ఇప్పుడు అందరి కళ్లు కంగనారౌనత్‌ మీదనే ఉన్నాయి. 'క్వీన్‌, తను వెడ్స్‌ మను రిటర్న్స్‌' వంటి ఘన విజయాల తర్వాత ఆమె తనకు తానుగా తానే బాలీవుడ్‌ నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ని అని చెప్పుకుంటోంది. అంతేకాదు... తనకు ప్రస్తుతం ఉన్న క్రేజ్‌ను అడ్డుపెట్టుకొని తనకు చిత్రానికి 15కోట్ల రెమ్యూనరేషన్‌ కావాలని డిమాండ్‌ చేస్తుండటంతో పాటు నిర్మాతలకు పలు కండీషన్స్‌ కూడా పెడుతోందిట. దీంతో ఈ అమ్మడును తమ తమ చిత్రాలలో పెట్టుకోవాలని ఆశపడుతున్న నిర్మాతలకు, దర్శకహీరోలకు ఆమె వణుకుపుట్టిస్తోంది. అంత పెద్ద మొత్తాన్ని, ఒక విధంగా చెప్పుకోవాలంటే యంగ్‌హీరోలను మించిన పారితోషికాన్ని ఆమె డిమాండ్‌ చేయడం చూసి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. తాజాగా హిస్టారికల్‌ మూవీ 'రాణిలక్ష్మీభాయ్‌'తో పాటు 'ఝూన్సీలక్ష్మీ' గా కూడా ఆమెను పెట్టుకోవాలని ఆశపడిన నిర్మాతలు ఆయా ప్రాజెక్ట్‌ల నుంచి ఆమెను పక్కనపెడుతున్నారని బాలీవుడ్‌ సమాచారం. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019