'బాహుబలి' టీమ్‌ సందడి చేయడానికి రెడీ..!

Wed 14th Dec 2016 04:24 PM
baahubali 2 movie,baahubali team,rana,prabhas,raja mouli,baahubali team lets celebrate on decenber 31st 2016  'బాహుబలి' టీమ్‌ సందడి చేయడానికి రెడీ..!
'బాహుబలి' టీమ్‌ సందడి చేయడానికి రెడీ..!
Sponsored links

'బాహుబలి పార్ట్‌ 2' చిత్రం యూనిట్‌ డిసెంబర్‌ 31న భారీ ఫంక్షన్‌ను చేయనుంది. అయితే ఇది న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం మాత్రం కాదు. ఈ చిత్రం షూటింగ్‌ ఈనెల 27తో పూర్తి కానుంది.ఇక మిగిలిన కొద్దిపాటి ప్యాచ్‌వర్క్‌ను కూడా ఫినిష్‌ చేసి డిసెంబర్‌31న ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టనున్నారు. దాంతో ఆరోజును యూనిట్‌ అందరికీ మరపురాని రోజుగా మిగిలిపోవాలని నిర్ణయించారు. ఆరోజు రాత్రికి అంటే డిసెంబర్‌31న రాత్రికి ఈ చిత్ర దర్శక,నిర్మాతలు ఓ స్పెషల్‌ పార్టీ అరేంజ్‌ చేసి, దీనిని కూడా పబ్లిసిటీకి వాడుకోవాలని నిర్ణయించారు. 

ఈ వేడుకకు చిత్రంలో పనిచేసిన నటీనటులు, టాప్‌ టెక్నీషియన్స్‌ నుంచి రోజు వారి జీతానికి పనిచేసిన కిందిస్ధాయి సిబ్బంది వరకు అందరినీ ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా భారీ వేడుకను జరిపి నూతన సంవత్సరంలో ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌పై దృష్టిపెట్టనున్నారు. మొత్తానికి ఈ చిత్రానికి కష్టపడ్డా చిన్న చిన్న వారిని కూడా ఆహ్వానించి, అందరితో ఈ సంబరాన్ని జరుపుకోవాలని నిర్ణయించిన దర్శక దిగ్గజం రాజమౌళి, నిర్మాతలైన ఆర్కా మీడియా అధినేతలను అభినందించాల్సిందే.  

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019