Advertisement

బంగారాన్ని జానుని చేసి హీట్ పుట్టిస్తున్నారు!!

Tue 13th Dec 2016 01:28 PM
ok bangaram,ok janu,adityarai kapoor,shraddha kapoor,maniratnam,karanjohar  బంగారాన్ని జానుని చేసి హీట్ పుట్టిస్తున్నారు!!
బంగారాన్ని జానుని చేసి హీట్ పుట్టిస్తున్నారు!!
Advertisement

మణిరత్నం సౌత్ లో తీసిన సూపర్ హిట్ సినిమా 'ఓకె బంగారం' ఇపుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా 'ఓకె జాను' పేరుతో ఆదిత్యరాయ్‌కపూర్- శ్రద్ధాకపూర్‌లు జంటగా నటిస్తున్నారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ ప్రాజెక్ట్‌కి ప్రొడ్యూసర్లు గా మణిరత్నం, కరణ్‌జోహార్‌లు వ్యవహరిస్తున్నారు. మరి సౌత్ లో ఈ 'ఓకె బంగారం' ఎంత హాట్ సంచలనం అయ్యిందో... ఇప్పుడు బాలీవుడ్ ట్రైలర్ లోను ఈ 'ఓకె జాను' అంతే హాట్ సంచలనంగా కనబడుతుంది.

ఆదిత్యరాయ్‌కపూర్, శ్రద్ధాకపూర్‌ రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. ఇంకా ఈ హాట్ సన్నివేశాలు చూసిన వారు ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ కొట్టేస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారట. సౌత్ లో నిత్యా మీనన్, దుల్కర్ సల్మాన్ లు రెచ్చిపోయి 'ఓకె బంగారం' లో నటించారు. ఇక ఇప్పుడు శ్రద్ధ కపూర్ కూడా హాట్ సన్నివేశాల్లో సెగలు పుట్టించేసిందని బాలీవుడ్ కుర్రకారు తెగ ఇదైపోతున్నారు. లిప్ కిస్సులతో పాటు రొమాంటిక్ సన్నివేశాల్లో ఈ  శ్రద్ధ, ఆదిత్య ల జంట హద్దులు మీరి నటించిందని ఈ ట్రైలర్ చూసిన వారికి అర్ధమవుతుంది. అయితే ఈ 'ఓకె బంగారం' సినిమా సౌత్ లో కంటే బాలీవుడ్ లో కొంచెం రొమాంటిక్ యాంగిల్, హాట్ హాట్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయనే ప్రచారం జరుగుతుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement