Advertisementt

'ధృవ' కలెక్షన్ ను దాస్తున్నారెందుకు..?

Tue 13th Dec 2016 01:46 PM
dhruva,dhruva collections,hit talk,ram charan,allu aravind  'ధృవ' కలెక్షన్ ను దాస్తున్నారెందుకు..?
'ధృవ' కలెక్షన్ ను దాస్తున్నారెందుకు..?
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ 'ధృవ' సినిమా డిసెంబర్ 9  న రిలీజ్ అయ్యి థియేటర్స్ లో దుమ్ము దులిపేస్తుంది. ఈ సంవత్సరం చివరిలో ఈ సినిమాతో టాలీవుడ్ భారీ హిట్ అందుకుని ఈ ఏడాదిని విజయవంతంగా పూర్తిచేసిందనే చెప్పాలి. ఇక రామ్ చరణ్ కి కూడా 'మగధీర' తరవాత అంతటి హిట్ ఇచ్చింది ఈ 'ధృవ' చిత్రం. అయితే కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం బాగానే వసూలు చేసిందని చెబుతున్నారు....... కానీ ఈ విషయాన్నీ ధృవ నిర్మాత అయిన అల్లు అరవింద్ ఎక్కడా చెప్పడం లేదు. 

ఇప్పటి వరకు వరుసగా మూడు రోజులు సెలవలు రావడం తో 'ధృవ' కి బాగా కలిసొచ్చి థియేటర్స్ అన్ని ఫుల్ గా నిండిపోతున్నాయి. అయితే కలెక్షన్స్ ని ఓపెన్ గా చెబితే ఎక్కడ ఐటి దాడులు జరుగుతాయో అన్న భయంతోనే చిత్ర యూనిట్ ఎక్కడా కలెక్షన్స్ గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడుతుందనే వార్త ఇప్పుడు ఫిలింనగర్ సరికిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక బయ్యర్స్ కూడా 'ధృవ' కి కలక్షన్స్ సరిగ్గా లేవని కలరింగ్ ఇస్తున్నారట. అయితే కలెక్షన్స్ విషయాన్ని ఎక్కడా నోరు జారొద్దని నిర్మాతే వారికి సూచించినట్లు చెబుతున్నారు. దాని వలనే బయ్యర్స్ 'ధృవ' చిత్రానికి పెద్దగా కలెక్షన్స్ లేవని ప్రచారం చేస్తున్నారట.

మరి మెగా హీరో సినిమా అందులోను చిరు కొడుకు రామ్ చరణ్ సినిమా అంటే మామూలు విషయం కాదు. అంతేకాకుండా 'ధృవ' సినిమా మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకుని రన్ అవుతుంది. ఇక వెబ్సైట్ కూడా ధృవ కి 3  కి తగ్గకుండా రేటింగ్స్ ఇచ్చారు. మరి ఇంత పాజిటివ్ గా వున్న ఈ సినిమా కు కలెక్షన్స్ సరిగ్గా లేవంటే ఎవరన్నా నమ్మే విషయేనా అది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ