Advertisement

ఎంతైనా...వర్మ గ్రేట్‌...కదా..!

Wed 30th Nov 2016 02:29 PM
ram gopal varma,rgv,sarkar 3,vangaveeti,vijayawada  ఎంతైనా...వర్మ గ్రేట్‌...కదా..!
ఎంతైనా...వర్మ గ్రేట్‌...కదా..!
Advertisement

తన మొదటి చిత్రం 'శివ' నుంచి తాజాగా 'సర్కార్‌3' వరకు వర్మ ఎక్కువగా తీసేవి వివాదాస్పద యదార్థ సంఘటనలు, వివాదాస్పద వ్యక్తుల జీవితాలనే. ఇలాంటి చిత్రాలు తీయడంలో ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది. కేవలం టాలీవుడ్‌లో వేలిపై లెక్క పెట్ట గలిగే చిత్రాలను మాత్రమే తీసినప్పటికీ, ఎలాంటి అండదండలు లేకుండా బాలీవుడ్‌ వెళ్లి, అక్కడ అవకాశాలు దక్కించుకోవడం నిజంగా తెలుగువారికి గర్వకారణమే. అలాగే ఆయన అక్కడ ఎంచుకున్న చీకటిరాజ్యానికి, మాఫియా, రౌడీయిజం వంటి వారి వ్యక్తులను ఆధారంగా చేసుకొని తీసిన చిత్రాలు, కొన్ని వివాదాస్పద సంఘటనలను తెరపై చూపించిన ఆయన ధైర్యాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి. నిజంగా వర్మ తీసిన చిత్రాలు జయాపజయాలకు అతీతంగా అందరిలో ఎంతో ఆసక్తిని రేపి వివాదాస్పదమైనా ఆయన పట్టించుకోలేదు. ఇక సినిమాలు లేనప్పుడు కూడా కేవలం వివాదాస్పద ట్వీట్స్‌,కామెంట్స్‌ ద్వారా ఆయన నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటాడు. అలాగే తన చిత్రాలకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చేలా, బాగా మార్కెట్‌ జరిగేలా, ఒకేసారి వివిధ భాషల్లో అతితక్కువ బడ్జెట్‌తో తీసే ఆయన ఫార్ములా వల్ల కోట్లు పోగొట్టుకున్న నిర్మాతలు కేవలం స్వల్పమే. ఇక నిర్మాతగా కూడా ఆయన ఇలాంటి చిత్రాలే తీస్తాడు. ముంబైని, ముంబై సినీ పరిశ్రమను శాసించే, వణుకుపుట్టించే మాఫియా నేపథ్యంలో బాల్‌థాకరేతో పాటు దావూద్‌ఇబ్రహీం, చోటాషకీల్‌ వంటి వారిని స్పూర్తిగా తీసుకుని తీసినవే ఎక్కువ. ఇక పరిటాల రవి జీవితచరిత్ర ఆధారంగా తీసిన 'రక్తచరిత్ర'లో ఓ సన్నివేశంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ను కూడా వివాదాస్పదంగా చూపిన ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇక 'సర్కార్‌' సిరీస్‌, 'కిల్లింగ్‌ వీరప్పన్‌', '27/11 ఎటాక్స్‌' వంటి చిత్రాలతో పాటు తాజాగా ఆయన విజయవాడ రౌడీయిజం బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న 'వంగవీటి' చిత్రం షూటింగ్‌ పూర్తయింది. కులాల మధ్య సమరం జరిగే బెజవాడ నేపథ్యంలో ఆయన ఓ కులానికి ఆధ్యుడు, మరో కులానికి పరమ విరోధి అయిన 'వంగవీటి'ని ఎలా చూపించనున్నాడు అనేది ఆసక్తిని కలిగిస్తోంది. 

తను బెజవాడలోని సిద్దార్ద్‌కాలేజీలో ఉన్న సమయంలో అక్కడ క్షుణ్ణంగా చూసిన అక్కడి కులపోరును ఆయన ఈ చిత్రంలో చూపించనున్నాడు. ఇక ఆయన తెగువ గురించి చెప్పుకోవాలంటే విడుదలైన తర్వాత ఫ్లాప్‌ అయినప్పటికీ ఆడియో విడుదలైన తర్వాత 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పలరాజు'లో  సినిమా దర్శకులపై వెటకారంగా రాయించిన పాటలో తన పేరునే మొదట ప్రస్తావిస్తూ, ఆ తర్వాత మిగిలిన వారిపై సెటైర్లు వేస్తూ వచ్చే పాటను ఆడియోలో విన్నతర్వాత ఎందరో దర్శకులు అంతర్గతంగా ఆయనపై కక్ష్య పెంచుకున్న సందర్భం కూడా ఉంది. ఇక తన మొదటి చిత్రం 'శివ'ని కూడా ఆయన బెజవాడ రౌడీయిజం నేపథ్యాన్నే తీసుకుని సంచలనం సృష్టించాడు. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి. కాగా వర్మ 'వంగవీటి' చిత్రం అనౌన్స్‌ చేసినప్పటి నుండి ఆయనకు పలు బెదిరింపులు కూడా వచ్చిన మాట వాస్తవమే. అయినా కూడా ఎందరు వద్దని వారిస్తున్నా కూడా ఈ చిత్రం ఆడియో వేడుకను డిసెంబర్‌ 3న విజయవాడలోనే చేసి, తెర వెనుకే కాదు.. తెర ముందు కూడా తన ధైర్యాన్ని చూపించడానికి నిర్ణయించాడు. ఇది ప్రాణాలకే ప్రమాదం అన్న హెచ్చరికలు ఆయన ఖాతరు చేయడం లేదు. ఇక ఈ చిత్రాన్ని కూడా ఫిబ్రవరిలోపు విడుదల చేయాలని, ఇక తాజాగా తనను గతంలో విమర్శించి, వర్మ చిత్రాలలోనే ఇక నటించనని మీడియా ముఖంగా ప్రకటించిన అమితాబ్‌ను ఒప్పించి, తన 'సర్కార్‌3' చిత్రంతో మరలా అమితాబ్‌తో కలిసి పనిచేస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ను కూడా ఆయన వేగంగా పూర్తి చేసి మార్చి 17న విడుదల చేస్తానని ప్రకటించాడు. ఈ చిత్రం ప్రదర్శన హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్ధ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ దక్కించుకోవడం విశేషం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement