Advertisementt

వినాయక్ డైరెక్షన్ లో గోపిచందా....!

Wed 09th Nov 2016 04:33 PM
v v vinaik,gopi chendhu,gopi vinaik combination movie  వినాయక్ డైరెక్షన్ లో గోపిచందా....!
వినాయక్ డైరెక్షన్ లో గోపిచందా....!
Advertisement
Ads by CJ

గోపీచంద్ మొదటినుండి మాస్ పాత్రలకే ఓటేస్తున్నాడు. మొదటి  సినిమా నుండి గోపీచంద్  మాస్ హీరోగానే ఎదిగాడు. హిట్స్ ప్లాపులు అంటూ తేడా లేకుండా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. చిన్న దర్శకుడు,పెద్ద దర్శకుడు అనేది లేకుండా అందరితో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా గోపీచంద్... సంపత్ నంది డైరెక్షన్ లో ఒక మూవీలో నటిస్తున్నాడు. ఇంకో సినిమా 'ఆక్సిజెన్' లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే తన తదుపరి సినిమాలు కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు.

తన కెరీర్లో ఎక్కువగా ప్లాపులతో సతమతమవడం వల్ల ఇప్పుడు చాలా జాగ్రత్తగా సినిమాల ఎంపికలో శ్రద్ద తీసుకుంటున్నాడు. అయితే తన తదుపరి సినిమాలు కె.కె.రాధామోహన్ నిర్మాణంలో ఒక సినిమా, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక నిర్మాతలు సెట్ అయిన ఆ సినిమాలకి ఇంకా కథ, దర్శకులు దొరకలేదని టాక్. అయితే ఒక కథకి వి.వి వినాయక్ డైరెక్టర్ అయితే బావుంటుందని గోపీచంద్ అనుకుంటున్నాడట. ఇక వి. వి.వినాయక్ కూడా గోపీచంద్ తో సినిమా చెయ్యడానికి సుముఖం గా వున్నాడని అంటున్నారు. తన దగ్గర వున్న ఒక పోలీస్ కథతో గోపీచంద్ తో సినిమా చెయ్యడానికి వి.వి వినాయక్ రెడీ అయ్యాడని అంటున్నారు. ఇక వినాయక్ చిరు 150 వ చిత్రం కంప్లీట్ కాగానే గోపీచంద్ తో సినిమా చెయ్యాలని భావిస్తున్నాడట. 

అసలు గోపీచంద్ తో.... వి. వి. వినాయక్ సినిమా చేయడానికి మరో కారణం కూడా ఉందట. అదేమిటంటే మిర్యాల రవీందర్ రెడ్డి కి వి. వి.వినాయక్ సన్నిహితుడు కావడం వల్ల కూడా ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యిందనే ప్రచారం జరుగుతుంది.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ