Advertisement

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (08-11-16)..!

Wed 09th Nov 2016 03:34 PM
naga chitanya interview,sree ramaraksha song launch,pizza 2 movie matter,okkadochadu audio launch matter,jayammu nishchayammura movie news  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (08-11-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (08-11-16)..!
Advertisement
>`సాహసం శ్వాసగా సాగిపో` వంటి డిఫరెంట్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ చేయడం వల్ల నటుడుగా హ్యాపీగా  ఉన్నాను - నాగచైతన్య

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం సాహసం శ్వాసగా సాగిపోస‌. మిర్యా స‌త్య‌నారాయ‌ణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను న‌వంబ‌ర్ 11న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్యతో ఇంట‌ర్వ్యూ....

డిఫ‌రెంట్ మూవీ...

సినిమాను గ‌తేడాది డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నాం. కానీ రెండు లాంగ్వేజ‌స్‌లో షూటింగ్ చేయ‌డం కార‌ణం ఒక‌టైతే, మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేయ‌డం వ‌ల్ల సినిమా ఇంత ఆల‌స్య‌మైంది. అయితే ఆల‌స్య‌మైంద‌ని ఏ టెన్ష‌న్ లేదు. ప్రేమ‌మ్ కంటే ముందుగానే సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ ప్రేమ‌మ్ త‌ర్వాత రిలీజైంది. రెండు సినిమాలు చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. ఇలాంటి డిఫ‌రెంట్ మూవీస్ చేయ‌డం ప‌ట్ల ఓ న‌టుడుగా చాలా హ్యాపీగా ఉన్నాను. 

న‌టుడుగా పూర్తి స‌హ‌కారం చేశాను...

-  ప్రేమ‌మ్ ప్ర‌మోష‌న్స్ స‌రిగా లేవ‌నే వార్త‌లు ఎందుకు వ‌చ్చాయో ఏమో, అలాగే నిర్మాత‌ల ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ వారికి ఉంటుంది. కానీ ఒక న‌టుడుగా ప్రేమ‌మ్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో, ప్ర‌మోష‌న్ విష‌యంలో పూర్తి స‌హ‌కారం అందించాను.

కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది...

- ల‌వ్‌స్టోరీస్ నాకు కంఫ‌ర్ట్ జోన్ మూవీస్‌.  ప్రేమ‌మ్ త‌ర్వాత ఆ కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. ఇంకా డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీస్ ట్రై చేస్తే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తార‌ని తెలిసింది. 

రోల్ గురించి....

- ప్రేమ‌మ్ సినిమాలో ఒక వ్య‌క్తి ఏజ్ గ్యాప్‌లో జ‌రిగే మూడు ల‌వ్‌స్టోరీస్ కాంబినేష‌న్‌. ఇక సాహ‌సం శ్వాస‌గా సాగిపో అనే ఓ కుర్రాడు రెండు వేర్వేరు ప‌రిస్థితుల్లో ఎలా ఉంటాడోన‌ని చూపిస్తుంది. ఫ‌స్టాఫ్ అంతా ఏ మాయ చేసావే సినిమాకు ఎక్స్‌టెన్ష‌న్‌గా క‌న‌ప‌డుతుంది. ఇక సెకండాఫ్ ఘ‌ర్ష‌ణ స్ట‌యిల్లో స‌స్పెన్స్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. 

టైటిల్ జ‌స్టిఫికేష‌న్‌...

- కుర్రాడు త‌ను ప్రేమించిన అమ్మాయికి ఓ స‌మ‌స్య ఎదుర‌వుతుంది. ఆ స‌మ‌స్య నుండి ఆ అమ్మాయిని కాపాడ‌టానికి ఎలాంటి సాహ‌సం చేశాడ‌నేదే క‌థ‌. అందువ‌ల్లే ఈ సినిమాకు సాహ‌సం శ్వాస‌గా సాగిపో అనే టైటిల్ పెట్టారు. 

త‌మిళంలో కూడా చేయాల‌నుకున్నాను...

-  సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా చేయాల‌నుకున్నాను. అయితే త‌మిళంలో షూటింగ్ ముందుగానే స్టార్ట‌య్యింది. అందువ‌ల్ల గౌత‌మ్‌గారి నెక్ట్స్ మూవీలో తెలుగు, త‌మిళంలో నేనే చేస్తాన‌ని రిక్వెస్ట్ చేశాను. త‌మిళ హీరోలు ఇక్క‌డ ట్రై చేస్తున్న‌ట్లే మ‌నం కూడా త‌మిళంలో సినిమాలు చేయాలి. వ‌చ్చే ఏడాది నా ల‌క్ష్య‌మ‌దే.

పెళ్లి గురించి...

-ఫ‌స్ట్ అఖిల్ పెళ్ల‌వుతుంది. త‌న మార్యేజ్‌ను రోమ్‌లో ప్లాన్ చేస్తున్నారు. డిసెంబ‌ర్‌లో  ఎంగేజ్‌మెంట్ ఉంటుంది. మేలో పెళ్లి ఉంటుంది. త‌ర్వాతే నా పెళ్లి ఉంటుంది. 

.  href="/gallery-thumbs/29941/4/0/1/sree-ramaraksha-song-launch.html">సుధీర్ బాబు, సునీల్ ముఖ్యఅతిథులుగా `శ్రీరామరక్ష`  టీజ‌ర్‌, సాంగ్ విడుద‌ల‌

వశిష్ఠ సినీ అకాడమీ బ్యానర్‌పై రజిత్‌, షామిలి, నిషా, విజయ్‌కుమార్‌, షఫీ, జ్యోతి, శంకరాభరణం రాజ్యలక్ష్మి, కాశీ విశ్వనాథ్‌ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం 'శ్రీరామరక్ష'. రాము దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రభాత్‌ వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌, సాంగ్ రిలీజ్ కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. హీరో సుధీర్‌బాబు టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా, హీరో సునీల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీరామ‌ర‌క్ష‌ టీజ‌ర్ చూస్తున్న‌ప్పుడు `సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలు` అనే సినిమాను చూస్తున్న‌ప్పుడు ఎలాంటి ఫీలింగ్ క‌లిగిందో అలాంటి ఫీలింగ్ క‌లిగింది. ఈ సినిమా యూనిట్‌కు టైటిల్‌కు త‌గిన విధంగానే శ్రీరాముని ఆశీస్సులు ఉండాల‌ని కోరుకుంటున్నానని హీరో సునీల్ తెలిపారు. చిన్న సినిమాలు ప్రేక్ష‌కుల్లోకి వెళ్లాలంటే అంద‌రి స‌హ‌కారం అవ‌స‌రం అనిపించ‌డంతో కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి వ‌చ్చాను. ఈ మ‌ధ్య విడుద‌లైన చిన్న సినిమాలు మంచి విజ‌యాల‌ను సాధిస్తున్నాయి. `శ్రీరామ‌ర‌క్ష‌` టీజ‌ర్ చూస్తుంటే విజువ‌ల్స్ బావున్నాయి. కంటెంట్ బేస్డ్ మూవీగా తెలుస్తుంది. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నానని హీరో సుధీర్‌బాబు అన్నారు. టీజ‌ర్ చాలా బావుంది. సినిమా ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తి క్రియేట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, యూనిట్ స‌క్సెస్ అయిన‌ట్లు క‌న‌ప‌డుతుందని ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ తెలియ‌జేశారు. 

 నేను ర‌చ‌యిత‌గా ఈ స్టేజ్‌పై నిల‌బ‌డ‌టానికి కార‌ణ‌మైన సుకుమార్‌గారికి ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. అమ్మ‌, నాన్న‌, గురువు అనేవాళ్లు మ‌న‌కు క‌నిపించే శ్రీరామ‌ర‌క్ష‌. అయితే దైవం, ఇప్పుడు మా సినిమాను ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్ల‌డానికి స‌పోర్ట్ చేసిన సుధీర్‌బాబు, హీరో సునీల్‌వంటి వారు క‌నిపించ‌ని శ్రీరామ‌ర‌క్ష‌. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్ అని రైట‌ర్ కేధారినాథ్ అన్నారు. సునీల్‌గారు సినిమా చూసి సీతారామ‌య్య మ‌న‌వ‌రాలు సినిమాతో పోల్చారు కానీ సినిమా సీతారామ‌య్య మ‌న‌వ‌డిది. సినిమా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుందని నిర్మాత ప్ర‌భాత్‌వ‌ర్మ చెప్పారు. ర‌జిత్‌, షామిలి స‌హా ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ బాగా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్ అని డైరెక్ట‌ర్ రాము చెప్పారు. మంచి సినిమాలో అవ‌కాశం ఇచ్చిన దర్శ‌క నిర్మాత‌ల‌కు హీరో ర‌జిత్‌, హీరోయిన్ షామిలి సౌంద‌రాజ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

>ఆర్‌పీఏ క్రియేషన్స్, డీవీ క్రియేషన్స్ కలయికలో పిజ్జా-2 

వరుస విజయాలతో దూకుడు మీదున్న తమిళ పాపులర్ హీరో విజయ్‌సేతుపతి  తమిళంలో నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్. ఈ చిత్రాన్ని పిజ్జా-2 పేరుతో.. ప్రేమకథా చిత్రమ్, జక్కన్న లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీమతి లత సమర్పణలో ఆర్‌పీఏ క్రియేషన్స్‌తో   డీవీ సినీ క్రియేషన్స్ సంస్థ కలిసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత డి.వెంకటేష్ తెలియజేస్తూ  ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసకుని థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించబడింది. వరుసగా ఏడు హిట్లతో తమిళ సినీ రంగంలో ముందంజలో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి ఈ చిత్రం ఎనిమిదవ హిట్‌గా నిలుస్తుంది. ఈ నెల 11న ఈ చిత్ర తెలుగు థ్రియేట్రికల్ ట్రైలర్‌, 14 న ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తెలుగులో ప్రేమకథా చిత్రమ్, జక్కన్న లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలు నిర్మించిన ఆర్‌పీఏ క్రియేషన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడం ఆనందంగా వుంది.  తెలుగు, తమిళ భాషల్లో  ఏకకాలంలో ఇదే నెలలో  చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు అని తెలిపారు. గాయత్రి నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నేరం ఫేమ్ రమేష్ తిలక్, సోనియా దీప్తి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శామ్ సిఎస్, సినిమాటోగ్రఫీ: దినేష్ క్రిష్ణన్, ఎడిటర్: భావన శ్రీకుమార్.

>దిల్ రాజు విడుద‌ల చేసిన 'ఒక్కడొచ్చాడు` ఆడియో

మాస్‌ హీరో విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'.  హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ చిత్రాన్ని నవంబర్‌ 18న గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. దిల్‌రాజు బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా....

విశాల్‌గానే ఉండాల‌నుకుంటున్నాను

హీరో విశాల్ మాట్లాడుతూ - క‌త్తిసండై అనే సినిమాను తెలుగులో ఒక్క‌డొచ్చాడు అనే పేరుతో  తెలుగులో న‌వంబ‌ర్ 18న విడుద‌ల చేస్తున్నాం. ఈ సినిమా ల‌వ్‌, యాక్ష‌న్‌, కామెడి స‌హా అన్నీ  ఎలిమెంట్స్ ప‌క్క‌గా కుదిరాయి. వ‌డివేలుగారు ఐదేళ్ల త‌ర్వాత ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ఎంట్రీ ఇస్తున్నారు. త‌మ‌న్నాతో మొద‌టిసారి క‌లిసి వ‌ర్క్ చేయ‌డం హ్యాపీగా ఉంది. సురాజ్‌తో తొలిసారి చేసిన సినిమా. ద‌ర్శ‌కుడుగా ఇలాగే చేయాల‌నే ఈగో ఏమీ పెట్టుకోకుండా అంద‌రి స‌ల‌హాలు వింటూ అందులో మంచి స‌ల‌హా తీసుకుంటూ సినిమాను ఓ టీమ్‌గా చేశాం. సినిమా బాగా రావాల‌ని టీం అంతా క‌ష్ట‌ప‌డ్డాం. స‌మాజంలోని ప్ర‌తి మ‌నిషి మైండ్‌కు ఓ వాయిస్ ఉంటుంది. ఆ మైండ్‌వాయిస్‌తో ఈ సినిమాలో మాట్లాడే అవ‌కాశం వ‌చ్చింది. సినిమాలో చివ‌రి ముప్పై నిమిషాలు ఓ విష‌యం చెబుతున్నాను. అదేంట‌నేదో సినిమా చూసే తెలుసుకోవాలి. హిప్ హాప్ త‌మిళ అద్భుత‌మైన ట్యూన్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.  నేను న‌టుడిగా ఇంకా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాను. కాబ‌ట్టి నేను అభిమానులు ఇవ్వాల‌నుకునే యాక్ష‌న్ లెజెండ్ బిరుదులేవీ వ‌ద్దు..నేను విశాల్‌గానే ఉండాల‌నుకుంటున్నాను. నా వ‌ల్ల వీలైనంత‌గా సోసైటీకి స‌పోర్ట్ చేస్తున్నాను. అమ్మాయి చ‌దువుకోసం తోడ్పాటునందిస్తున్నాను అన్నారు. 

విశాల్ నాకు ఇన్‌స్పిరేష‌న్‌

త‌మ‌న్నా మాట్లాడుతూ - ఈ సినిమా ఇంత బాగా రావ‌డానికి నిర్మాత హ‌రిగారే కార‌ణం. ప్ర‌తి విష‌యాన్ని ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్ రిచర్డ్స్ ప్ర‌తి విజువ‌ల్‌ను ఎంతో రిచ్‌గా చూపించారు. సినిమా క్లాస్ లుక్‌లో ఉంటుంది. హిప్ హాప్ త‌మిళ మ్యూజిక్ సూప‌ర్బ్‌. విశాల్ మంచి న‌టుడు, ఫైట్స్‌, డ్యాన్సులు చ‌క్క‌గా చేస్తాడు. ఈ సినిమాలో మంచి పెర్‌ఫార్మెన్స్ చేశాడు. విశాల్ మంచి యాక్ట‌రే కాదు, మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. విశాల్ వ్య‌క్తిగా నాకు చాలా ఇన్‌స్పిరేష‌న్‌. నేను, విశాల్ చేసిన ఒక్క‌డొచ్చాడు ఈ న‌వంబ‌ర్ 18న విడుద‌ల‌వుతుంది. అంద‌రూ సినిమాను చూసి పెద్ద హిట్ చేస్తార‌ని భావిస్తున్నాను అన్నారు. 

సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంది

దిల్‌రాజు మాట్లాడుతూ - నేను బొమ్మ‌రిల్లు సినిమా చేసిన‌ప్పుడు హ‌రి ఆ సినిమాను చెన్నైలో విడుద‌ల చేశాడు. అప్ప‌టి నుండి త‌న‌తో నాకు మంచి ప‌రిచ‌యం ఉంది. త‌న‌కు ఈ సినిమా మంచి హిట్ కావాల‌ని కోరరుకుంటున్నాను. పందెంకోడి సినిమాతో త‌నెంటో ప్రూవ్ చేసుకున్న విశాల్ ప‌న్నెండేళ్లుగా నిజాయితీతో హార్డ్‌వ‌ర్క్ చేస్తూ మంచి విజ‌యాల‌ను సాధించాడు. బాహుబ‌లి ముందు త‌మ‌న్నా వేరు, త‌ర్వాత త‌మ‌న్నా వేరు. త‌ను చేసే సినిమాలే త‌నెంటో మాట్లాడుతున్నాయి. ట్రైల‌ర్ చాలా బావుంది. హిప్ హాప్ త‌మిళ సంగీతం బావుంది. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటూ యూనిట్‌కు అభినంద‌న‌లు అన్నారు. 

ఒక్క‌డొచ్చాడు అన్ని హంగులున్న మంచి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. మంచి మ్యూజిక్‌కు మంచి సాహిత్యం కుదిరింది. సినిమా న‌వంబ‌ర్ 18న విడుద‌ల‌వుతుందని మాట‌ల ర‌చ‌యిత రాజేష్ తెలియ‌జేశారు. పాట‌ల ర‌చ‌యిత డా.చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి మాట్లాడుతూ..విశాల్‌గారి రాయుడు సినిమాలో ఒక పాట రాశాను . ఆ పాట న‌చ్చ‌డంతో నిర్మాత హ‌రిగారు ఈ సినిమాలో పాట‌లు రాసే అవ‌కాశం ఇచ్చారు. ముందు ఒక పాట రాయ‌మ‌న్నారు. ఆ పాట న‌చ్చ‌డంతో మ‌రో పాట ఇచ్చారు. అలా అన్ని పాట‌లు రాసే అవకాశం వ‌చ్చింది. ఇంత మంచి అవ‌కాశాన్ని ఇచ్చిన నిర్మాత హ‌రిగారికి థాంక్స్‌.. అన్నారు.

>‘జయమ్ము నిశ్చయమ్మురా’ అని ఆశీర్వదించిన సెన్సార్ బోర్డ్

తెలుగులో పల్లెవాసన ఉన్న సినిమాలు తగ్గాయి. తెలుగుదనం.. తెలుగు నేటివిటీ ఉన్న సినిమాలు అత్యంత అరుదుగా తప్ప రావడం లేదు. ఈ నేపథ్యంలో శివరాజ్ కనుమూరి అనే కొత్త దర్శకుడు దేశీయ వినోదం అందిస్తానంటూ జంధ్యాల పాత సినిమా టైటిల్ తో జయమ్ము నిశ్చయమ్మురా అంటూ రాబోతున్నాడు. ఇక ఈసినిమాలో శ్రీనివాసరెడ్డి హీరో అనగానే కామెడీగా ఉంటుందనుకున్నవారికి ఆ మధ్య రిలీజ్ చేసిన పాటతో సర్ ప్రైజ్ చేశారు. ఓ సాధారణ పాత్రలా ఆ పాటలో కనిపించి శ్రీనివాసరెడ్డి ఆకట్టుకున్నాడు. ఇక ఈనెల 13న ఆడియో విడుదల కానున్న ఈ మూవీని నవంబర్ 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు... అయితే ఆడియో కంటే  ముందే ఈ సోమవారం సినిమా సెన్సార్ కావడం విశేషం. మూవీకి సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ తో అద్భుతమైన ఫీల్ గుడ్ మూవీ చూశామనే కాంప్లిమెంట్ కూడా వచ్చింది. ఇక ఆడియోతో పాటు సినిమాకూ ప్రిపేర్ చేస్తున్నారా అన్నట్టుగా సినిమాలోని ఇంపార్టెంట్ పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ సరికొత్త ప్రమోషన్స్ కు టీజర్స్ లేపిందీ టీమ్. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటతో ఎంటైర్ ఇండస్ట్రీని ఆకట్టుకున్న ఈమూవీ.. రీసెంట్ గా తత్కాల్ ప్రవీణ్ అంటూ కమెడియన్ ప్రవీణ్ పై రిలీజ్ చేసిన టీజర్ సూపర్ అనిపించుకుంది. ఇక ఇప్పుడు కృష్ణభగవాన్ చేస్తోన్న అడపా ప్రసాద్ అనే పాత్రను పరిచయం చేశారు. 

అడపా ప్రసాద్ గా కృష్ణ భగవాన్ పాత్ర కూడా అద్భుతంగా ఉండబోతోంది.. అదిరిపోయే కామెడీ పంచబోతోంది అన్నట్టుగా ఉంది. ఎవరైనా పచ్చగా ఉంటే ఓర్వలేని పాత్రగా అడపా ప్రసాద్ సింగిల్ సీన్ తోనే కడుపుబ్బా నవ్వించారు. ఈ పాత్రలు చూస్తోంటే.. ఒకప్పుడు వంశీ, భారతీరాజా, జంధ్యాల తరహా రియలిస్టిక్ క్యారెక్టర్స్ గా అనిపిస్తున్నాయి. ఏదేమైనా అంచనాలు పెంచుతూనే.. బిజినెస్ నూ పెంచుతోన్న ఈ మూవీ మంచి విజయం సాధిస్తే..మరిన్ని తెలుగుదనం ఉన్న సినిమాలు వస్తాయనడంలో ఏ డౌట్ లేదు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement