Advertisementt

మహేష్ ఫ్యామిలీ నుండి డైరెక్టర్..!

Wed 02nd Nov 2016 12:51 PM
mahesh babu sister,manjula,director,sundeep kishan  మహేష్ ఫ్యామిలీ నుండి డైరెక్టర్..!
మహేష్ ఫ్యామిలీ నుండి డైరెక్టర్..!
Advertisement
Ads by CJ

నటిగా, నిర్మాతగా ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న సూపర్‌స్టార్‌ కృష్ణ తనయ, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సోదరి, బహుముఖ ప్రజ్ఞాశాలి మంజుల. త్వరలో ఆమె డైరెక్టర్‌ అవతారం ఎత్తనుంది. వాస్తవానికి ఆమె పదేళ్ల కిందట తాను నటించినప్పుడు కమర్షియల్‌ చిత్రాలలో కూడా గ్లామర్‌ హీరోయిన్‌గా చేయాలని భావించింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సౌందర్య హీరోయిన్‌గా నటించిన ఫ్లాప్‌ చిత్రం 'టాప్‌హీరో' చిత్రంలో మొదట దర్శకనిర్మాతలు ఆమెనే సంప్రదించారు. దీనికి కృష్ణ, మహేష్‌బాబుతోపాటు కుటుంబసభ్యులు అందరూ అంగీకరించినా కూడా ఘట్టమనేని అభిమానులు మాత్రం అందుకు అంగీకరించలేదు. అదే జరిగి ఉంటే మెగాబ్రదర్‌ నాగబాబు తనయ నిహారిక కంటే ముందుగా ఆ గోల్‌ను అచీవ్‌ చేసిన గ్లామర్‌ నటిగా ఆమె పేరు లిఖించబడి ఉండేది. ఆ తర్వాత నటన మీద తనకున్న మక్కువతో 'షో, కావ్యాస్ డైరీ, ఆరంజ్‌' వంటి చిత్రాలలో నటించిన మంజుల నిర్మాతగా 'షో, నాని, పోకిరి, కావ్యాస్‌ డైరీ, ఏమాయచేశావే' వంటి చిత్రాలతో తన టాలెంట్‌ను నిరూపించుకుంది. తాజాగా ఇంతకాలం తర్వాత ఆమె దర్శకత్వంపై తనకు ఉన్న మక్కువతో ఓ కమర్షియల్‌ చిత్రానికి దర్శకత్వం వహించడానికి తెర వెనుక ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆమె ఇటీవలే కమర్షియల్‌ హీరోగా నిరూపించకోవడానికి తపన పడుతున్న సందీప్‌కిషన్‌ హీరోగా ఓ చిత్రానికి స్టోరీ రెడీ చేసింది. దీనికి సందీప్‌కిషన్‌ కూడా ఓకే చెప్పాడట. ఇక ఆమె దర్శకత్వం వహించడం ఆమె కుటుంబ సభ్యులకు అభ్యంతరం ఏమీ లేదు. మరి ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాల్చిందే. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ