Advertisementt


అఖిల్ మ్యారేజ్ చూసే భాగ్యం లేనట్లే!

Tue 01st Nov 2016 11:12 PM
akhil,shreya bhoopal,akhil and shreya bhoopal marriage,europe rome  అఖిల్ మ్యారేజ్ చూసే భాగ్యం లేనట్లే!
అఖిల్ మ్యారేజ్ చూసే భాగ్యం లేనట్లే!
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సమంత పెళ్లికన్నా ముందే అక్కినేని అఖిల్ పెళ్లికొడుకైపోతున్నాడు. నాగ చైతన్య  వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు. కానీ అఖిల్ మాత్రం తాను ప్రేమించిన అమ్మాయి శ్రీయ భూపాల్ తో పెళ్ళికి తయారై కూర్చున్నాడు. మరి నాగ్ ఎలా ఒప్పుకున్నాడో  తెలియదు గాని అఖిల్ ఎంగేజ్ మెంట్ మాత్రం డిసెంబర్ లో ఉంటుందని అంటున్నారు. ఇక పెళ్లి మాత్రం వచ్చే వేసవిలో వుంటుందట. అయితే అఖిల్ వెడ్డింగ్ హడావిడి అప్పుడే మొదలైందని అంటున్నారు. ఇప్పటికే ఇరుకుటుంబాలు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చేశారట. ఇంతకీ అఖిల్ పెళ్లి హైదరాబాద్ లో జరుగుతుందా లేక ఎక్కడైనా.... అనేది కొంచెం సస్పెన్స్ గానే వుంది. ఎందుకంటే శ్రీయ భూపాల్ ఫ్యామిలీ వాళ్ళు ఈ పెళ్లిని ఘనంగా ప్లాన్ చెయ్యాలని చూస్తున్నారట. మరి నాగార్జున ఏమో ఈ పెళ్లి ఇక్కడ హైదరాబాద్ లో నార్మల్ గా చేద్దామని అనుకుంటున్నాడట. 

అయితే శ్రీయ భూపాల్ ఫ్యామిలీ మాత్రం రిచ్  మరియు డెస్టినేషన్ వెడ్డింగ్ కే ప్రిపేర్ అవుతున్నారని సమాచారం. అందుకే ఈ పెళ్లిని చాలా రిచ్ గా యూరప్‌లోని ఇటలీ రాజధాని రోమ్ లో చెయ్యాలని....  ఇలా చేస్తే కుర్రాళ్ళకి బాగా నచ్చుతుందని అంటున్నారట. ఇక రోమ్ లో పెళ్లి ముచ్చట్ల గురించి ఇరు కుటుంబాలు కలిసి మాట్లాడుకుని ఒక డెసిషన్ కి వచ్చారని అంటున్నారు. మరి ఎక్కడో రోమ్ లో గనక అఖిల్ పెళ్లి జరిగితే అక్కడికి నాగార్జున చాలా మంది గెస్ట్ లను తీసుకెళ్లాలి. అయితే అప్పుడే గెస్ట్ ల సంఖ్య కూడా ప్రిపేర్ చేసేశారని సమాచారం. రోమ్ లో గనక పెళ్లి జరిగితే అక్కడికి దాదాపు 600 మంది గెస్ట్ లు హాజరవుతారని ఒక  అంచనాకి వచ్చేశారట. మరి ఇదే గనక జరిగితే అఖిల్ - శ్రీయ ల పెళ్లి ఒక రేంజ్ లో జరిగినట్లేగా..! అయితే దీనిపై అక్కినేని ఫ్యాన్స్ మాత్రం కొంచెం నిరాశకు గురవుతున్నారు. కారణం అఖిల్ మ్యారేజ్ చూసే భాగ్యం వారికి అందనంత దూరంలో పెడుతున్నందుకు...!  

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ