Advertisementt

మంచు వారబ్బాయి ఆకట్టుకుంటున్నాడు!

Tue 01st Nov 2016 07:38 PM
manchu manoj kumar,gunturodu,okkadu migiladu,manchu manoj  మంచు వారబ్బాయి ఆకట్టుకుంటున్నాడు!
మంచు వారబ్బాయి ఆకట్టుకుంటున్నాడు!
Advertisement

తన కెరీర్‌లో హీరోగా ఎన్నో సొంత చిత్రాల్లో నటించినప్పటికీ సరైన సక్సెస్‌ రాని హీరో మంచు మనోజ్‌. మోహన్‌బాబు ఇద్దరి కుమారుల్లో ఎంతో కొంత ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న హీరోగా మంచు మనోజ్‌ను చెప్పవచ్చు. రొటీన్‌ చిత్రాలను కాకుండా ఎంతో కొంత వైవిధ్యంగా తన చిత్రాలను ఉంచుకోవడం వల్ల మంచు విష్ణు, మంచు లక్ష్మీల కంటే మనోజే బెటర్‌ అనేది అందరి అభిప్రాయం. కాగా ప్రస్తుతం మంచు మనోజ్‌ రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. 'ఒక్కడు మిగిలాడు, గుంటూరోడు' చిత్రాలలో బిజీగా ఉన్న మనోజ్‌ నటిస్తున్న ఈ చిత్రాల ఫస్ట్‌లుక్‌ లని దీపావళి కానుకగా విడుదల చేశారు. అజయ్‌ అండ్రోస్‌ తెరకెక్కిస్తున్న 'ఒక్కడు మిగిలాడు' చిత్రం శ్రీలంక తమిళుల కోసం ఎల్‌టీటీఈ సంస్దను స్దాపించి, తన గెరిల్లా పోరాటంతో శ్రీలంక సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టిన దివంగత ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌ జీవిత కథ నేపధ్యంలో తెరకెక్కిన చిత్రంగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని చూస్తే అది నిజమేనన్న నమ్మకం కుదురుతోంది. వాస్తవానికి వర్మ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ చిత్రం ఆయన శిష్యుడు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ట్రేడ్‌ వర్గాల్లో ఆసిక్తిని రూపుతుండంతో పాటు మనోజ్‌ తన కెరీర్‌లో ఈ చిత్రంలోనే బెస్ట్‌ పెర్‌ఫార్పెన్‌ ఇచ్చాడనే ప్రచారం జోరందుకుంది. అలాగే గుంటూరోడు తో పక్కా మాస్ హీరోగా మంచు మనోజ్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement