ఉగాదికి కాటమరాయుడు రాబోతుండు..!

Tue 25th Oct 2016 06:14 PM
katama rayudu,power star pawan kalyan,katamarayudu release date fixed   ఉగాదికి కాటమరాయుడు రాబోతుండు..!
ఉగాదికి కాటమరాయుడు రాబోతుండు..!
Sponsored links

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి స్పీడు మీద ఉన్నట్లుగా తెలుస్తుంది. రాబోవు ఎన్నికల్లో తనపార్టీ తరఫున పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలన్న తలంపుతో ఉన్న పవన్ అందుకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు తేదీని ప్రకటించింది చిత్ర బృందం. వచ్చే సంవత్సరం అంటే 2017 మార్చి 29వ తేదీన కాటమరాయుడు చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా చాలా ఆలస్యంగా ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ  ఉగాది కానుకగా ఈ చిత్రం విడుదల కానుందన్నమాట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ కాబోతున్న సందర్భంగా రాబోవు ఎన్నిల నాటికి ఎన్ని వీలైతే అన్ని సినిమాలు చకచకా చేసేద్దామన్న దిశగా అడుగులు పడుతున్నాయి. పవన్ తాజా చిత్రమైన కాటమరాయుడులో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ చిత్రంలో వీరిద్దరూ మంచి సూపర్ హిట్ జోడిగా పేరొందారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. గోపాల గోపాల చిత్ర దర్శకుడు డాలి కాటమరాయుడు చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్నాడు.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019