జీవిత ఉద్యోగం పోయింది...!

Sun 23rd Oct 2016 04:06 PM
jeevitha,geetha,bathuku jatka bandi program,roja,sumalatha  జీవిత ఉద్యోగం పోయింది...!
జీవిత ఉద్యోగం పోయింది...!
Advertisement

మాజీ నటి, దర్శకురాలు జీవిత ఉద్యోగం పోయింది. కొద్ది నెలలుగా 'జీ తెలుగు' ఛానల్లో 'బతుకు జట్కాబండి' పేరుతో ప్రసారమవుతున్న కార్యక్రమంలో వ్యాఖ్యాతగా ఉన్న జీవితను తప్పించేశారు. ఆమె స్థానంలో సీనియర్ నటి గీతను ఎంపికచేసి ప్రసారం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు పరిష్కరించే ప్రోగ్రాం ఇది. 'పెదరాయుడి'లాగా తీర్పు చెబుతూ, సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి. ఇలాంటివే ఇతర ఛానల్లలో సైతం రోజా, సుమలత నిర్వహిస్తున్నారు. 

'బతుకు జట్కాబండి' నిర్వాహకురాలిగా జీవిత పనితీరు వివాదస్పదమైంది. బాధితులను ఆమె బెదిరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కార్యక్రమానికి రావాలంటే తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఇటీవలే ఒక వ్యక్తి పోలీసులను సైతం ఆశ్రయించాడు. కేసు రిజిస్టర్ అయింది. ఇక వ్యాఖ్యతగా పెద్ద మనసుతో వ్యవహరించాల్సిన జీవిత వ్యవహారశైలి సైతం టీవీ ఛానల్ కు నచ్చలేదట. ప్రోగ్రామ్ షూటింగ్ చేస్తున్నపుడు జీవిత అకస్మాత్తుగా ఇంటికి వెళ్లిపోతుందని తెలిసింది. ఇతర ఛానల్లలో ప్రసారమవుతున్న ఇలాంటి ప్రోగ్రామ్స్ కు మంచి రేటింగ్ వస్తుండగా, జీవిత  ప్రోగ్రామ్ మాత్రం వెనకబడింది. దాంతో నిర్వహకురాలిని మార్చాల్సిన పరిస్థితిలో మరో సీనియర్ నటి గీతను సంప్రదించారు. ఆమెతో కొనసాగిస్తున్నారు.


Loading..
Loading..
Loading..
advertisement