'పెళ్ళిచూపులు' హీరో తెగ నచ్చాడంట!

Sun 23rd Oct 2016 03:03 PM
ravi babu,vijay devarakonda,pelli choopulu,pig concept,ravi babu movie with vijay  'పెళ్ళిచూపులు' హీరో తెగ నచ్చాడంట!
'పెళ్ళిచూపులు' హీరో తెగ నచ్చాడంట!
Advertisement

టాలీవుడ్ లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత దర్శకుడిగా కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు రవిబాబు. కొత్త కొత్త ప్రయోగాలతో తన కంటూ చిత్రపరిశ్రమలో దర్శకుడుగా ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు రవిబాబు. ఆయన మూసలోనే మరో సరికొత్త ప్రయోగంతో ప్రస్తుతం ఓ పంది పిల్ల ప్రధాన భూమికగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు రవిబాబు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి కావస్తుంది.  

కాగా ఈ సినిమా రాజమౌళి ‘ఈగ’ తో సమానంగా ఉంటుందేమోనన్న ఆలోచన సినీ ప్రియులకు కలుగుతుంది. ఎందుకంటే పందిని కథాంశంగా సినిమా రూపొందుతుండటంతో ఇలా ఉంటుందేమోనన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే రవిబాబు ఈ సినిమా తర్వాత ‘పెళ్లిచూపులు’ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది.  వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు సంబందించిన కథా చర్చలు కూడా జరినట్లుగానే సమాచారం అందుతుంది.  

రవిబాబు సినిమా అంటేనే  ఆ సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉంటుందన్నది ప్రేక్షకుల విశ్వాసం. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రంలో ఎలాంటి కొత్తదనాన్ని రుచి చూయించబోతున్నారనేది వేచి చూడాల్సిందే. కాగా పెళ్లిచూపులు సినిమా విజయవంతంగా సంచలనం రేపడంతో పరిశ్రమలో ఆ సినిమా దర్శకుడికి, హీరోకి మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. ఇంతటి విజయం సంపాదించిన ‘పెళ్ళిచూపులు’ సినిమా హీరో విజయ్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్న విషయం తెలిసిందే. చెప్పొచ్చేదేంటంటే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 


Loading..
Loading..
Loading..
advertisement