విక్రమ్ కి ఇక్కడ బోరుకొట్టినట్టుంది ?

CineJosh news

 

ప్రముఖ నటుడు కమల్ హాసన్ తర్వాత కోలీవుడ్ లో మంచి ప్రయోగాత్మక పాత్రలు చేయగల సత్తా ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు విక్రమ్. ప్రధానంగా విక్రమ్ ‘ఐ’ సినిమాపై పెట్టిన ఎఫర్ట్ ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ‘ఐ’సినిమాలో ఆయన పాత్ర కోసం చేసిన కృషి కానీ, నటన కోసం పడ్డ పాట్లుగానీ సంచలనం రేపినవనే చెప్పాలి. ఈ మధ్యనే ‘ఇరుమగన్’  సినిమాతో మరో ప్రయోగాన్ని చేసిన విక్రమ్ అది హిట్ అయింది. తెలుగులో కూడా ‘ఇంక్కొక్కడు’పేరుతో  ఈ చిత్రం విడుదలైంది. అయితే విక్రమ్ ఇప్పుడు ఓ హాలీవుడ్ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో పడ్డాడట. హాలీవుడ్ లో బాగా పాపులరై సంచలనం రేపింది ఆ చిత్రం. ‘డోంట్ బ్రేథ్’ అనే పేరుతో, హర్రర్ సినిమాగా విడుదలై అక్కడ సంచలనం సృష్టించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రం 9 మిలియన్ కోట్లతో తెరకెక్కిస్తే ఏకంగా 120 మిలియన్ కోట్ల రూపాయలను రాబట్టి వసూళ్ల సునామీని సృష్టించింది. 
అయితే ఇప్పుడు ‘డోంట్ బ్రేథ్’ అనే ఈ సినిమాలో హీరో పాత్ర విక్రమ్ కు బాగా నచ్చేసిందంట. అందుకని వెంటనే ఆయన మదిలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలన్న ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. ఆ దిశగా విక్రమ్ అడుగులు వేస్తున్నాడని పరిశ్రమ వర్గాల టాక్ నడుస్తుంది. కానీ ఈ చిత్రాన్ని రీమేక్ చేసి తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో ఒకే సమయంలో చేసేసి విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం. కాగా విక్రమ్ తీసుకున్న ఈ నిర్ణయం మరో సంచలనాన్ని సృష్టించేదిగా కనబడుతుంది
vikram
i
inkokkadu
dont breth remake
hollywood movie.