బాబోయ్..సమంత ఎందుకిలా చేస్తుంది?

CineJosh news

సమంత ఈ మధ్య తన గ్లామర్ డోస్ ని ఒక్కసారిగా పెంచేసింది. ఆ మధ్యన వచ్చిన 'సికిందర్, సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాల్లో సమంత హాట్ అందాలతో రెచ్చిపోయి.... అదే గ్లామర్ డోస్ రీసెంట్ గా వచ్చిన 'జనతా గ్యారేజ్' వరకు కంటిన్యూ చేసింది. ఎంతో పద్దతిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన సమంత ఇలా ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఏమిటో అని అందరూ తెగ గుసగుసలాడుకుంటున్నారు. ఎన్ని కామెంట్స్ వినిపించినా కూడా సమంత మాత్రం తగ్గడం లేదు. ఇంకా ఇంకా స్పైసీ లుక్స్ లో కనబడటానికి ట్రై చేస్తూనే వుంది. ఇప్పుడు ఇదంతా చెప్పుకోవడానికి ఒక కారణం వుంది. అదేమిటంటే సమంత తాజాగా సౌత్  స్కోప్ కి సంబంధించి ఒక ఫోటో షూట్ చేయించుకుంది. ఈ షూట్ లో సమంత రెచ్చిపోయి ఫోటోలకు ఫోజిచ్చింది. ఇలా సమంత తన అందాలతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసేసింది. ఈ  ఫొటోస్ చూస్తే అందరూ సమంత ఎంతలా రెచ్చేపోయిందో అని అనుకోవాల్సిందే. 

అసలు సమంత అంత హాట్ గా కనిపించి ఆఫర్స్ పట్టేయ్యాలని చూస్తుందా.... లేక పెళ్ళైతే ఎలాగూ ఇలా చెయ్యడానికి కండిషన్ పెడతారు. అందుకే పెళ్ళికి ముందే ఇలా రెచ్చిపోయి అందాలను ఆరబోసినా తనని అడిగే వారుండరు అని ఇలా చేస్తోందా? ఎందుకైనా గాని సమంత కి ఈ మధ్యన సరిగ్గా అవకాశాలు రాకపోవడం వల్లనే ఇలా తన అందాలను చూపిస్తూ ఫొటోస్ తో పిచ్చేక్కిన్చే ప్రోగ్రాం పెట్టుకుందనే వారూ లేకపోలేదు. ఏది ఏమైనా కూడా సమంత ఇలా షూట్ చేయించుకుంది మాత్రం సౌత్ స్కోప్ కోసమేనట.

samantha
south scope magazine shoot
samantha exposing for south scope
actress samantha