ఈగ-2 కోసం నాని మానవ ప్రయత్నం!

Fri 30th Sep 2016 01:18 PM
nani,ss rajamouli,eega 2,nani views on eega 2 movie  ఈగ-2 కోసం నాని మానవ ప్రయత్నం!
ఈగ-2 కోసం నాని మానవ ప్రయత్నం!
Advertisement
Ads by CJ

ప్రముఖ దర్శకుడు రాజ‌మౌళి, నాని కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన అద్భుత ఫాంట‌సీ చిత్రం ఈగ. ఈ  చిత్రం సృష్టించిన సెన్సేష‌న్ సంగతి తెలిసిందే.  తొలిసారిగా టాలీవుడ్ లో వీరిద్దరు కలిసి చేసిన  ఈ కొత్త ప్ర‌యోగానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చంది. అంతవరకు ఫాంట‌సీ సినిమాలు చూసే అలవాటు లేని తెలుగు ప్రజలకు అటువంటి వాటిపై అభిరుచిని పెంచేలా స‌రికొత్త రీతిలో విజువ‌ల్ ట్రీట్ ఇచ్చి సెహబాష్ అనిపించుకున్నాడు రాజమౌళి. దాంతో అంత‌ర్జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నాడు రాజ‌మౌళి. క‌మ‌ర్షియ‌ల్ పరంగానూ హిట్ అయిన ఈ చిత్రంలో నాని క్యారెక్ట‌ర్ చాలా చిన్న‌దే అయినప్పటికీ అందులో నటించే అవకాశం రావడమే చాలా గొప్పగా చెప్పుకుంటాడు నాని.

కాగా ఇప్పుడు ఈగ‌కు సీక్వెల్ గా ఈగ- 2 చేసే ఉద్దేశం ఉన్నట్లు సమాచారం అందుతుంది.  బాహుబ‌లి-2 అయ్యాక జ‌క్క‌న్నఈ ప్రాజెక్ట్ పై పడే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా బాగా వినిపిస్తున్నాయి. జోరందుకుంటున్న ఈ విషయాన్ని గురించి నాని వద్ద ప్రస్తావించినప్పుడు... ఈగ‌-2 రావాల‌ని గట్టిగా కోరుకుంటున్న వ్యక్తుల్లో నేనూ ఒకడిని. ఈగ మొదటి భాగంలో నా క్యారెక్ట‌ర్ చ‌నిపోయింది. అలాంటప్పుడు సెకండె పార్ట్ లో నా పాత్ర ఇక ఉండదు కదా. అయినా ఇప్పుడు నాకోసం కాకుండా ఈగ-2 చిత్రం రావాల్సిందేనంటూ పట్టుబడుతున్న వ్యక్తుల్లో నేనూ ఒక్కడిని. అందుకోసం ఎలాంటి నిర్ణ‌య‌మైనా రాజ‌మౌళి తీసుకోవాల్సిందే. నేను ఈగ-2 సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను.. అన్నాడు నాని. నాని ఏదో ఒక పాత్ర ఈగ-2లో చేయాలని, అందుకోసం గట్టిగానే మానవ ప్రయత్నాలు లాంటివి చేస్తున్నాడు నాని. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ