Advertisementt

ఆస్కార్‌ బరిలో ఈసారి తమిళ చిత్రం!

Fri 23rd Sep 2016 03:24 PM
oscar foreign category film,visaranai,oscar nomination,dhanush,vetrimaran  ఆస్కార్‌ బరిలో ఈసారి తమిళ చిత్రం!
ఆస్కార్‌ బరిలో ఈసారి తమిళ చిత్రం!
Advertisement
Ads by CJ

ప్రతి ఏడాది జరిగే ఆస్కార్‌ ఫిలిం అవార్డ్స్‌లో భాగంగా ఫారిన్ కేటగరి విభాగంలో భారత్‌ తరపున కూడా ఓ చిత్రాన్ని ఎంపిక చేసి పంపుతారు. ఈ బాధ్యతను ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేపడుతుంది. ఈ సంవత్సరం ఈ కేటగరిలోకి తమిళ చిత్రం 'విశారణై' అనే తమిళ చిత్రాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ కేతన్‌మెహతా ప్రకటించారు. ఓ ఆటోడ్రైవర్‌ తన స్వీయ అనుభవాలతో రచించిన 'లిప్‌లాక్‌' అనే నవల ఆధారంగా దర్శకుడు వెట్రిమారన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రముఖ నటుడు ధనుష్‌ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో పోలీసుల అకృత్యాలు, లంచగొండితనం, న్యాయం ఓడిపోవడం వంటి పలు అంశాలను ఈ చిత్రంలో దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు. 2016 ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల రివార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొంది. ఈ చిత్రం జాతీయ అవార్డును పొందడంతో పాటు 72వ వెనిస్‌ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శింపబడింది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ