Advertisement

ఇక..రామ్‌ ట్రాక్‌లోకి వచ్చినట్లేనా..!

Fri 23rd Sep 2016 03:17 PM
hero ram,nenu sailaja,hyper movie,ram movies,ram in track  ఇక..రామ్‌ ట్రాక్‌లోకి వచ్చినట్లేనా..!
ఇక..రామ్‌ ట్రాక్‌లోకి వచ్చినట్లేనా..!
Advertisement

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరోగా రామ్‌కు మంచి పేరుంది. ఆయన తన ఎనర్జిటిక్‌ యాక్టింగ్‌తో ప్రేక్షకుల ఆదరణ చూరగొంటు వస్తున్నాడు. కానీ దాదాపు ఐదేళ్లు హిట్‌ లేక ఈ హీరో నానా అగచాట్లు పడ్డాడు. ఎట్టకేలకు తాను కాస్త రూట్‌ మార్చి చేసిన 'నేను..శైలజ' చిత్రంతో మరలా రూట్‌లోకి వచ్చాడు. కాగా ఈ చిత్రంలో రామ్‌ కాస్త డిఫరెంట్‌గా ప్రయత్నించి విజయం సాధించాడు. తాజాగా ఆయన మరలా తన పాత రూట్‌లోకి వచ్చి తనకు 'కందిరీగ' వంటి హిట్‌ను అందించిన సంతోష్‌శ్రీనివాస్‌ 'హైపర్‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ను చూస్తే మరలా మనకు పాత రామ్‌ గుర్తుకొస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్‌లో రామ్‌ తన పూర్వపు ఎనర్జిటిక్‌ యాక్షన్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు సత్యరాజ్‌ను సీరియస్‌ రోల్స్‌కే పరిమితం చేసిన వారికి భిన్నంగా ఇందులో సత్యరాజ్‌ను పక్కా ఎంటర్‌టైనింగ్‌ యాక్టింగ్‌తో సంతోష్‌ శ్రీనివాస్‌ చూపించనున్నాడు.ఈ చిత్రం ఫాదర్‌ సెంటిమెంట్‌ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి 'నేను..శైలజ' ఇచ్చిన హిట్‌తో రామ్‌ తాను మరలా తన పాత రూట్‌లోకి వచ్చినట్లు అర్దమవుతోంది. మరి ఈ చిత్రం రామ్‌కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచిచూడాల్సివుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement