Advertisementt

వారికి జగనే టార్గెట్..!

Thu 22nd Sep 2016 06:49 PM
  వారికి జగనే టార్గెట్..!
వారికి జగనే టార్గెట్..!
Advertisement
Ads by CJ

కాపుగర్జన సందర్భంగా జరిగిన తుని సంఘటనను విచారిస్తే లోటస్‌పాండ్‌ పీఠం కదులుతుందని టిడిపినాయకులు హెచ్చరిస్తున్నారు. తునిలో వాడిన డ్రోన్ల డొంకలాగితే లోటస్‌పాండ్‌ డొంక కదులుతుందని వారు జగన్‌పై విరుచుకుపడుతున్నారు. తిరుపతి నుంచి జగన్‌ ప్రోత్సాహంతో భూమన కరుణాకర్‌రెడ్డి రైళ్లను బుక్‌ చేసి అక్కడికి జనాలను తరలించింది నిజం కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా సిబిఐ విచారణ అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. నాదెండ్లభాస్కర్‌రావు ఎన్టీఆర్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించినపుడు ధ్వంస రచన చేసి అనేక మంది ప్రాణాలు పొగొట్టుకోవడానికి చంద్రబాబే కారణమని, అలాగే నయింను పెంచి పోషించింది చంద్రబాబే అని సంచలన ప్రకటన చేశాడు. దీనిపై మండిపడుతూ తెలుగుదేశం నాయకులు జగన్‌కి తుని సంఘటనకు ముడిపెట్టి ఆయనపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ