Advertisementt

చిరు.. ప్రోమో వదులుతున్నారు!

Thu 22nd Sep 2016 06:14 PM
chiranjeevi,mek,promo,october,mega star chiranjeevi mek promo  చిరు.. ప్రోమో వదులుతున్నారు!
చిరు.. ప్రోమో వదులుతున్నారు!
Advertisement
Ads by CJ

వెండితెరపై అదరగొట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం తన 150వ చిత్రంగా తమిళ 'కత్తి' రీమేక్‌గా 'ఖైదీ నెం.150' చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 50శాతం పైగాఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కాగా  చిరు మొట్టమొదటి సారిగా టీవీ తెరపై చేస్తోన్న అతి పెద్ద గేమ్‌ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' డిసెంబర్‌ నుండి టీవీలో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు నాగార్జున హోస్ట్‌గా చేసిన ఈ సక్సెస్‌ఫుల్‌ గేమ్‌ షోలో చిరు ఎలా కనిపించనున్నాడు? బుల్లితెరపై ఆయన లుక్‌ ఎలా ఉండనుంది? అనే విషయాలు అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాగా ఈ గేమ్‌ షో కోసం చిరు కొన్ని రోజుల పాటు రిహార్సల్స్‌ కూడా చేశాడట. అలాగే ఈ గేమ్‌షోలో చిరు ఎలా కనిపించనున్నారు? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగాభిమానుల కోసం ఈ గేమ్‌షోకు సంబంధించిన ఓ ప్రోమోను మాటీవీ అక్టోబర్‌లో విడుదల చేయనుంది. మొత్తానికి నాగార్జునకు ధీటుగా చిరు చేస్తోన్న ఈ గేమ్‌షో రెట్టింపు అంచనాలతో వస్తోంది. మరి చిరు ఈ విషయంలో కూడా విజేత అవుతాడో? లేదో? వేచిచూడాల్సివుంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ