Advertisement

సినీ నటులు నిజంగా నటిస్తున్న వేళ...!

Mon 12th Sep 2016 09:37 PM
nadigar sangam statement,cauvery water war,vishal,karunas,tamilnadu,karnataka  సినీ నటులు నిజంగా నటిస్తున్న వేళ...!
సినీ నటులు నిజంగా నటిస్తున్న వేళ...!
Advertisement

కావేరి నదీ జలాల కోసం అటు తమిళనాట సినీ నటులు, ఇటు కన్నడ సినీ నటుల మధ్య పోరాటం నడుస్తుంది.  కావేరి జలాలపై తమిళనాడు రాష్ట్రానికి  15వేల క్యూసెక్కుల నీటిని పదిరోజులపాటు విడుదల చేయాలని సుప్రీంకోర్టు  కర్ణాటకను ఆదేశిస్తూ ఉత్తర్వులు కూడా జారీచేసింది.  కాగా  సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై కర్ణాటకలో నిరసనలతో కూడి ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా కర్ణాటక  భగ్గుమంది. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కన్నడ సంఘాలు రకరకాల  ఆందోళనలు చేస్తున్నాయి. రాష్ట్రబంద్ లు నిర్వహించాయి. కాగా ఈ బంద్ లో కన్నడ సినీ రంగం చాలా చురుకుగా పాల్గొన్నది. దాంతో ఈ విషయంపై తమ రాష్ట్రంలో తాము ఉధ్యమించాలని తమ వాయిస్ ప్రజల్లో వినిపించాలని తమిళ నటులు భావించారు. అందులో భాగంగా  కావేరి జలాల హక్కుల పరిరక్షణలో  తమిళ ముఖ్యమంత్రి అమ్మ  తీసుకునే ఎటువంటి చర్యలకైనా  తాము పూర్తి అండగా ఉంటామని దక్షిణ భారత సినీ నటుల సంఘం ప్రకటించింది. అదే సందర్భంలో జయలలితను కించపరిచేలా మాట్లాడిన శాండిల్ వుడ్ నటుల తీరును ఖండించింది. కాగా ఇటువంటి పరిస్థితుల్లో అటు కోలీవుడ్  ఇటు శాండిల్ వుడ్ నటుల మధ్య కొత్త సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. కానీ ఈ పోరాటం కేవలం కావేరీ జలాలకే పరిమితం అవుతుందన్న స్పష్టత ఆయా నటులకు పూర్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.   

కావేరి జలాలపై నటుడు విశాల్ స్పందిస్తూ....తమిళ ప్రజల దాహం తీర్చేందుకు, రైతుల వ్యవసాయానికి నీరు అందించే నిమిత్తం జయలలిత తీవ్రంగా కృషి చేస్తుందనీ,  అందులో భాగంగా జయలలిత సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించారని పేర్కొన్నాడు. అయినా కూడా కర్ణాటక వారు ఆందోళనకు దిగడం, ఆ విషయంపై  కన్నడ నటుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నాడు.  ఈ విషయంపై అమ్మ ఎలాంటి చర్యలు తీసుకున్నా అందుకు తమ మద్దతు పూర్తిగా ఉంటుందని వెల్లడించాడు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement