Advertisement

ఆ కమెడియన్ అంతు చూడండి...!

Mon 12th Sep 2016 09:44 PM
comedian kapil sharma,abha singh,bjp,acb,corruption,abha singh lawyer  ఆ కమెడియన్ అంతు చూడండి...!
ఆ కమెడియన్ అంతు చూడండి...!
Advertisement

భాజపా ప్రభుత్వంలో కూడా అవినీతి జరుగుతుందంటూ ప్రత్యక్ష బాధితుడిగా ఆరోపణలు చేసిన కమెడియన్ కపిల్ శర్మకి కొత్త చిక్కొచ్చి పడింది. కపిల్ శర్మ సొంత ఇంటిని నిర్మించుకొనేప్పుడు అక్రమాలకు పాల్పడ్డాడని అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని సీనియర్ న్యాయవాది అభా సింగ్ డిమాండ్ చేసింది. ఇంకా కపిల్ శర్మపై  ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ వెర్సోవా పోలీస్ స్టేషన్ లో  అభాసింగ్ రాతపూర్వకమైన లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. అయితే అభా ప్రధానంగా కపిల్ శర్మ ఇంటిని నిర్మించడం కోసం మడ అడవుల(మాంగ్రూవ్స్)ను ధ్వంసం చేసి అక్రమంగా ఇల్లు కట్టాడని ఆరోపించింది.

కాగా కపిల్ శర్మ గతంలో చేసిన ఓ ట్వీట్ ద్వారా వివాదం రేగింది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారి ఒకరు తనను రూ. 5 లక్షలు లంచం అడిగాడని కపిల్ శర్మ ఆ ట్వీట్ ద్వారా లోకానికి తెలిపాడు. ఇంకా మోడీని కూడా చురకలంటించేలా మీ పాలనలో కూడా ఇటువంటి అవినీతి జరుగుతుందంటూ పేర్కొనడంతో వివాదం చెలరేగింది. ఇప్పుడు సీనియర్ న్యాయవాది అభాసింగ్ స్పందిస్తూ.. అవినీతి అధికారిపై ఏసీబీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని కపిల్ శర్మను ప్రశ్నించింది.  అదే విధంగా కపిల్ శర్మ చేపట్టిన అక్రమ నిర్మాణాలను బీఎంసీ అధికారులు కూల్చివేయాలని అభాసింగ్  డిమాండ్ చేసింది.

ఎప్పుడైనా, అది ఎక్కడైనా సెలబ్రిటీలకు పోలీసులు అనుకూల వైఖరిని ప్రదర్శిస్తుంటారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా సల్మాన్ ఖాన్ కేసు పదేళ్లు నడవడమే. కాగా కపిల్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుంటే తాను కోర్టును ఆశ్రయిస్తానని అభాసింగ్ వెల్లడించింది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement