'జనతా గ్యారేజ్‌'ను పట్టించుకోని బాలయ్య...!

Mon 12th Sep 2016 09:06 AM
balakrishna,comments,janatha garage movie,jyo achyutananda movie,sai korrapati,varahi chalanachitram,rajamouli,venkatesh   'జనతా గ్యారేజ్‌'ను పట్టించుకోని బాలయ్య...!
'జనతా గ్యారేజ్‌'ను పట్టించుకోని బాలయ్య...!
Advertisement
Ads by CJ

తాజాగా తన ఆప్తుడు, నిర్మాత, వారాహిచలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వంలో రూపొందిన 'జ్యో అచ్యుతానంద'పై నటసింహం బాలకృష్ణ పొగడ్తల వర్షం కురిపించాడు. తన ఫేస్‌బుక్‌ ద్వారా ఆయన ఈ విషయాన్ని పోస్ట్‌ చేశారు. కానీ రాజమౌళి, వెంకటేష్‌ వంటి వారి ప్రశంసలు పొంది, బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతున్న 'జనతా గ్యారేజ్‌'పై మాత్రం ఆయన ఎలాంటి కామెంట్‌ చేయలేదు. బాలయ్య ఎన్టీఆర్‌ నటించిన 'జనతా గ్యారేజ్‌'పై కూడా మంచి కామెంట్స్‌ చేస్తే బాగుంటుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. తోటి హీరోలు, దర్శకుల ప్రశంసలు అందుకుంటూ రివార్డులు కూడా సొంతం చేసుకుంటున్న'జనతా గ్యారేజ్‌'పై రాజమౌళి, తాజాగా విక్టరీ వెంకటేష్‌లు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి 'జ్యో అచ్యుతానంద' మీద కూడా ప్రశంసల వర్షం కురిపించి.. తన రివ్యూను రాసుకొచ్చాడు. మరి బాలయ్య మాత్రం కేవలం 'జ్యో అచ్యుతానంద' మీద తప్పితే 'జనతా గ్యారేజ్‌'పై ఎలాంటి స్పందన తెలియజేయకపోవడం ఫిల్మ్‌నగర్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ