కొరటాలకు ఆయన భార్యే స్ఫూర్తి...!

Sun 11th Sep 2016 08:50 PM
koratala siva,siva wife,aravinda,ramakrishna paramahamsa,direction,mahesh babu,next film  కొరటాలకు ఆయన భార్యే స్ఫూర్తి...!
కొరటాలకు ఆయన భార్యే స్ఫూర్తి...!
Advertisement
Ads by CJ

వరసగా మూడు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో దర్శకునిగా తన స్దాయిని పెంచుకున్న దర్శకుడు కొరటాల శివ. ఆయన చిత్రాలన్నీ ఏదో ఒక మంచి సందేశంతో రూపొందుతున్నాయన్న సంగతి తెలిసిందే. కొరటాల శివను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన భార్య అరవింద.. రామకృష్ణ పరమహంసను స్ఫూర్తిగా తీసుకుంటోంది. అందులోని నిన్ను నీవు ప్రేమించు, ఇతరులను ప్రేమించు, నీవు చేసే వృత్తిని ప్రేమించు అనే ఫిలాసఫీని నమ్ముతుంది. ఇప్పుడు అదే సూక్తుల ఆధారంగా కొరటాల తన తదుపరి మహేష్‌బాబు చిత్రం కోసం తన భార్య నమ్మే ఫిలాసఫీనే పాయింట్‌గా తీసుకున్నాడట. తన భార్య ప్రేరణతో ఓ లైన్‌ అనుకోవడం, దానికి మహేష్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం జరిగిపోయాయని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మరి ఈ చిత్రంలోని సందేశాన్ని మహేష్‌ ద్వారా చెప్పబోతున్న కొరటాల శివ... ఈ తాజా చిత్రాన్ని కూడా బ్లాక్‌బస్టర్‌ చేయాలని కంకణం కట్టుకున్నాడని సమాచారం.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ