రాబోయే రోజులు మెగా హీరోలవే..!

మెగా హీరోల వరస చూస్తుంటే బాక్సాఫీస్‌ను ఈ హీరోలు దత్తత తీసుకుంటున్నారా? లేక ఇతర హీరోలకు స్దానం లేకుండా కబ్జా చేస్తున్నారా? అనే సందేహం రాకమానదు. ఈ నెల అక్టోబర్‌ నుండి వరుసగా నెలకో సినిమా చొప్పున మెగాహీరోలు నటించిన చిత్రాలు క్యూ కడుతున్నాయి. అక్టోబర్‌ 7న విజయదశమి కానుకగా రామ్‌చరణ్‌ నటించిన 'ధృవ' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఇక నవంబర్‌ చివరి వారంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ హీరోగా రూపొందుతున్న 'మిస్టర్‌' చిత్రం, క్రిస్టస్‌ కానుకగా వరుణ్‌తేజ్‌, శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో రూపొందే 'ఫిదా' చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం.150' విడుదల కానుంది. ఇక ఫిబ్రవరిలో ఎలాగైనా రామ్‌చరణ్‌ సుకుమార్‌తో చేయబోయే చిత్రాన్ని ఎట్టిపరిస్ధితుల్లోనూ పూర్తి చేసి విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇక మార్చిలో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటించనున్న 'కాటమరాయుడు' చిత్రం విడుదల ఖాయంగా కనిపిస్తోంది. ఏప్రిల్‌లో వేసవి కానుకగా అల్లుఅర్జున్‌ నటించనున్న 'డిజె' చిత్రం, ఇక సాయిధరమ్‌తేజ్‌-గోపీచంద్‌ మలినేని చిత్రం, అల్లు శిరీష్‌ నటిస్తున్న తాజా చిత్రం.. ఇలా మూకుమ్మడిగా ఒక నెల తర్వాత మరో నెలను దత్తత తీసుకున్నట్లు మెగా హీరోలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయాలని భావిస్తున్నారు. 

mega heroes
mega heroes movies list 2016
chiranjeevi
ram charan
pawan kalyan
allu arjun
sirish
sai dhram tej
varun tej
sirish