'ధృవ' పై అరవింద్‌స్వామి స్పందన..!

తమిళంలో సంచలన విజయం సాధించిన 'తని ఒరువన్‌' విడుదలై ఏడాది గడిచింది. కాగా ఈచిత్రంలో నాటి తరం క్రేజీ హీరో అరవింద్‌ స్వామి విలన్‌గా నటించాడు. ఆయన పాత్ర చిత్రానికే పెద్ద హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన ఏడాదికి మరలా ఈ చిత్రం తెలుగురీమేక్‌ 'ధృవ'లో నటిస్తుండటం చాలా సంతోషంగా ఉందని అరవింద్‌స్వామి అంటున్నాడు. తమిళ వెర్షన్‌లోని తన పాత్రకు ఏమాత్రం తగ్గకుండా తెలుగులో తన పాత్రను సురేందర్‌రెడ్డి డిజైన్‌ చేశాడని ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. రామ్‌చరణ్‌ కూడా ఈ చిత్రంలో మేజర్‌ కీలకపాత్ర అయిన అరవింద్‌స్వామి క్యారెక్టర్‌ ఈ చిత్రానికి పెద్ద అస్సెట్‌ కానుందని చెబుతున్నాడు. హీరో పాత్రకు ధీటుగా ఈ చిత్రంలో అరవింద్‌స్వామి నటన ఉంటుందని 'ధృవ' యూనిట్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. మొత్తానికి తెలుగు వెర్షన్‌లో తన పాత్ర ఒరిజనల్‌ వర్షన్‌ కంటే అద్బుతంగా ఉంటుందని ఈ చిత్రంతో తనకు టాలీవుడ్‌లో కూడా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఊపందుకుంటుందని అరవింద్‌ స్వామి ఎంతో నమ్మకంతో ఉన్నారు. 

dhruva
aravind swamy
aravind swamy about dhruva
dhruva movie
aravind swamy happy with dhruva role