Advertisementt

తరుణ్ కి అఖిల్ బంపర్ ఆఫర్..!

Tue 16th Aug 2016 09:25 PM
tarun bhaskar,akhil akkineni,cinema chance,pelli choopulu  తరుణ్ కి అఖిల్ బంపర్ ఆఫర్..!
తరుణ్ కి అఖిల్ బంపర్ ఆఫర్..!
Advertisement
Ads by CJ

‘పెళ్ళి చూపులు’ సినిమా విడుదలై మంచి విజయవంతంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ‘పెళ్ళి చూపులు’ చిత్రంతో దర్శకుడు తరుణ్ భాస్కర్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ‘పెళ్ళి చూపులు’ చిత్రానికి ముందు తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిల్మ్స్ చూసి ఆకర్షితుడయ్యాడు అఖిల్. తర్వాత పలు సందర్భాల్లో తరుణ్ భాస్కర్ ని కలిసిన అఖిల్ మీ వద్ద ఏదైనా మంచి కథ ఉంటే  చెప్పు మీతో చిత్రం చేస్తాను అన్నాడట. అయితే అప్పట్లో తరుణ్ ఏమనుకున్నాడో  ఆయన మనుస్సులో ఏముందో తెలియదు గానీ ‘మీకు తగిన కథ నా వద్ద లేదు’ అని తప్పించుకున్నాడట. అఖిల్ మొదటి సినిమా ప్రయత్నాల్లో భాగంగా ఈ తతంగమంతా జరిగింది. ఆ తర్వాత్ అఖిల్ సినిమాలో అఖిల్ నటించడం, ఆ సినిమా అడ్రస్ లేకుండా పోవడంతో ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు హీరో అఖిల్. ఎంత యూత్ ఫాలోయింగ్ ఉన్నా సినిమాలో విషయం లేకపోతే ఇలాగే ఉంటుందంటూ తీవ్రంగా మదనపడుతున్నాడు అఖిల్. 

తాజాగా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ‘పెళ్ళి చూపులు’ చిత్రాన్ని చూశాడు అఖిల్. వెంటనే ఆ సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ ను అడ్రస్ చేస్తూ ‘ఎప్పటికైనా తరుణ్ తో నేను సినిమాను చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ వెల్లడించాడు. కానీ తరుణ్ భాస్కర్..  అఖిల్ విషయంలో ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ