Advertisementt

'ట్యూబ్‌లైట్' లో వుంది సల్మానేనా..!!

Wed 17th Aug 2016 01:00 PM
salman khan,sultan,tubelight,tubelight first look,fans unhappy  'ట్యూబ్‌లైట్' లో వుంది సల్మానేనా..!!
'ట్యూబ్‌లైట్' లో వుంది సల్మానేనా..!!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ జాతాగా నటిస్తున్న చిత్రం 'ట్యూబ్‌లైట్'. 'సుల్తాన్' తర్వాత కబీర్‌ఖాన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం రూపొందుతుంది.  1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తుంది.  కాగా ప్రస్తుతం లేహ్ లడఖ్ ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సల్మాన్ సరసన చైనీస్ నటి జూ జూ హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తోంది.  

సల్మాన్ ఖాన్, కబీర్ ఖాన్ కాంబినేషన్‌లో విడుదలైన 'ఏక్ థా టైగర్', 'భజరంగీ భాయిజాన్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీ సృష్టించిన విషయం తెలిసిందే.  ఇప్పుడు మరోసారి యాక్షన్, అడ్వెంచర్ ఓరియంటెడ్ కథతో చిత్రాన్ని రూపొందించి రంజాన్ సందర్భంగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.  ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫస్ట్ స్టిల్‌ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. 

ఫస్ట్ లుక్ అన్నట్లుగా విడుదల చేసిన ఈ స్టిల్‌లో సల్మాన్ ముఖం సరిగ్గా కనిపించకపోవడంతో అభిమానులు పరేషాన్ అవుతున్నారు. అభిమానులంతా ఒక్కసారిగా అసంతృప్తికి లోనవుతున్నారు. కానీ చూస్తున్న స్టిల్ ను బట్టి సల్మాన్ ఓ సైనికుడిలా కనిపిస్తున్నాడు. భుజానికి తుపాకి తగిలించుకొని యుద్ధ భూమిలోకి నడుస్తున్న సోల్జర్‑లా సల్మాన్ వెళ్ళుతున్నట్టుంది. కానీ చిత్రం మొత్తంలో సల్మాన్ సైనికుడులా ఉంటాడా లేకా కొంతభాగమేనా అన్నది తెలియడం లేదు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ