'కబాలి' ని కట్ చేస్తున్నారు..!

ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న 'కబాలి' చిత్రం విషయంలో దర్శకనిర్మాతలు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రంలోని పలు సీన్లు సాగదీసినట్లుగా ఉండటంతో ఈ చిత్రంలోని 12 నిమిషాల నిడివి కలిగిన సీన్లకు కత్తెర వేశారు. ఈ చిత్ర క్లైమాక్స్‌ను దర్శకుడు రంజిత్‌ పా ఎలా ముగించాలో తెలియక, రజనీ అభిమానులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో తెలియక ఓపెన్‌ ఎండింగ్‌ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని మలేషియా భాషలో డబ్‌ చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. మలేషియా వెర్షన్‌ క్లైమాక్స్‌లో డాన్‌ రజనీ పోలీసులకు లొంగిపోయినట్లు చూపించారని తెలుస్తోంది. మలేషియా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి, అక్కడి పోలీసులకు గౌరవం ఇవ్వడం కోసమని చెప్పి మలేషియాలో ఎవ్వరూ ఫీల్‌ కాకుండా ఉండేందుకు 'కబాలి' పోలీసులకు లొంగిపోయే విధంగా క్లైమాక్స్‌ను రూపొందించి విడుదల చేయడం గమనార్హం. 

kabali
trimming
12 minutes trimming to kabali
kabali movie updates