Advertisementt

ఇవి ప్రభాస్‌ టైటిల్సేనా..?

Sun 10th Jul 2016 03:18 PM
prabhas,bahubali 2,siddha,radha premakatha,sujith,uv creations  ఇవి ప్రభాస్‌ టైటిల్సేనా..?
ఇవి ప్రభాస్‌ టైటిల్సేనా..?
Advertisement
Ads by CJ

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం 'బాహుబలి2' తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన తన మిత్రులైన యూవీ క్రియేషన్స్‌ అధినేతలతో రెండు చిత్రాలు చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్‌లో ప్రభాస్‌ కూడా భాగస్వామి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఓ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో ప్రభాస్‌ పోలీస్‌ పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. కాగా యూవీ క్రియేషన్స్‌ వారు తాజాగా ఫిలించాంబర్‌లో 'సిద్ద, రాధ ప్రేమకథ' అనే టైటిల్స్‌ను రిజిష్టర్‌ చేశారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ప్రభాస్‌తో పాటు ఇతర హీరోలతో కూడా మరికొన్ని చిత్రాలను నిర్మించడానికి రెడీ అవుతోంది . ఈ నేపథ్యంలో తాజాగా వారు రిజిష్టర్‌ చేసిన టైటిల్స్‌ ప్రభాస్‌ సినిమాకేనా, లేక మరో చిత్రానివా? అనే సందేహం అందరిలో కలుగుతోంది. అయినా ప్రస్తుతం విభిన్న టైటిల్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోల చిత్రాలకు కూడా లేడీ ఓరియంటెడ్‌ టైటిల్స్‌ కూడా పెడుతున్నారు. దీంతో ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండు టైటిల్స్‌ ప్రభాస్‌కేనని అంటున్నారు. సో...ఇదే నిజమైతే 'సిద్ద'తో పాటు 'రాధ ప్రేమకథ' కూడా ప్రభాస్‌ చిత్రానికి టైటిల్స్‌ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ