Advertisementt

నాగ్‌కు సమంత...మళ్ళీ షాక్‌!

Sun 10th Jul 2016 03:16 PM
nagarjuna,samantha,shock,naga chaitanya,marriage  నాగ్‌కు సమంత...మళ్ళీ షాక్‌!
నాగ్‌కు సమంత...మళ్ళీ షాక్‌!
Advertisement
Ads by CJ

గత కొన్నిరోజులుగా నాగచైతన్య, సమంతల ప్రేమాయణం... వారి పెళ్లిపై పలు వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లికి ఎట్టకేలకు నాగ్‌ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. కానీ తమ పెళ్లి విషయంలో సమంతకు నాగ్‌ పలు కండీషన్లు పెడుతున్నాడని తెలుస్తోంది. దీంతో తాజాగా సమంత తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని, వచ్చే ఏడాది కూడా సింగిల్‌ గానే ఉంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో అందరూ షాక్‌తిన్నారు. నాగ్‌ కండీషన్ల వల్ల విసిగిపోయిన సమంత ఈ నిర్ణయాన్ని తీసుకొని నాగ్‌ను ఇబ్బంది పెట్టే నిర్ణయం తీసుకుందని అంటున్నారు. వాస్తవానికి సమంత ఈమధ్య కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఆల్‌రెడీ అడ్వాన్స్‌లు తీసుకున్న నిర్మాతలకు కూడా వాటిని తిరిగి ఇచ్చేస్తూ వచ్చింది. దీంతో త్వరలోనే చైతూ, సమంతల పెళ్లి గ్యారంటీ అని భావించిన వారికి సమంత పెద్ద షాక్‌నే ఇచ్చిందని అంటున్నారు. అయినా ఈ విషయంలో చైతూ మాత్రం తనకేమీ పట్టనట్లు మౌనంగా ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ