Advertisementt

చిరంజీవిని ఇబ్బంది పెట్టేస్తున్నారుగా?

Thu 30th Jun 2016 12:57 PM
chiranjeevi 151,chianjeevi 150  చిరంజీవిని ఇబ్బంది పెట్టేస్తున్నారుగా?
చిరంజీవిని ఇబ్బంది పెట్టేస్తున్నారుగా?
Advertisement
Ads by CJ

చిరంజీవి రాజకీయ నాయకుడిగా రాణించకపోయినా సినీ అభిమానుల్లో ఆయనకున్న క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. అలాగే సినిమాలు అన్నా చిరుకు ఇంకా మోజు తీరలేదు. ఈ మధ్య కాలంలో చిరంజీవి హాజరయిన ప్రతి సినిమా వేడుకలోనూ ఆయన మాట్లాడిన మాటల్లో ఆ నిజాయితీ ధ్వనించింది. అందుకే మెగా స్టార్ బ్రాండ్ వాల్యూలో సత్తా తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నమే కత్తిలాంటోడు, అదే 150వ చిత్రం. వచ్చే సంక్రాంతికి ఎలాగయినా ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న కసితో దర్శకుడు వీవీ వినాయక్ తదితర టీమ్ మొత్తం ఆల్రెడీ రంగంలోకి దూకి శరవేగంగా షూటింగ్ మొదలుపెట్టేశారు. ఇలా 150వది ఓ వైపు పరుగులు పెడుతుండగానే అభిమానుల ఆతృత, మీడియా వారి అత్యుత్సాహంతో చిరు 151వ చిత్రాన్ని కూడా వీరే ఫైనల్ చేయించేట్టు ఉన్నారు. 

బోయపాటి శ్రీను అని ఒకరు, రాజమౌళి అని ఇంకొకరు... ఇలా ఎవరికి తోచిన దర్శకుడి పేరు వాళ్ళు రాసేసుకుని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఒక వేళ చిరంజీవి గనక నిజంగానే 150 తదుపరి 151 గూర్చి ఆలోచించి భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలన్న నిర్ణయం తీసుకుంటే అది అభిమానులకు శుభవార్తే. అంతదాకా కత్తిలాంటోడు విడుదల కోసం వేచి చూద్దాం తప్ప అరవై ఏళ్ల వయసు దాటిన చిరును మరిన్ని చిత్రాలు చేయాలని ఇబ్బంది పెట్టడం సరికాదు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ